సినిమా హిట్ అయ్యింది కాబట్టి ఇలా కామెంట్స్ చేస్తున్నారా.? ఆ క్యారెక్టర్ నిజంగానే అవసరమా.?

Ads

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ జైలర్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పాత రికార్డులను బ్రేక్ చేసుకుంటూ ..అటు కోలీవుడ్ టాలీవుడ్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం లో ఇతర ఇండస్ట్రీల నుంచి స్టార్ హీరోలను గెస్ట్ రోల్ కి తీసుకోవడం జరిగింది.

ఒకరకంగా ఈ మూవీ సక్సెస్ వెనక ఆ హీరోల పాత్ర ఉంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే తెలుగు ఆడియెన్స్ కు మాత్రం అన్ని బాగున్నప్పటికీ ఎందుకో ఈ మూవీలో ఒక కాన్సెప్ట్ ఇబ్బందికరంగా ఉన్నట్లు అర్థమవుతుంది. ఆ ఒక్కటి అవసరమా అని కామెంట్స్ పెట్టి మరి తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ సీన్ ఏంటో తెలుసుకుందాం..

Ads

జైలర్ మూవీలో రమ్యకృష్ణ తో పాటుగా తమన్న మరియు కొంతమంది స్పెషల్ హీరోలు కీలకమైన పాత్రల్లో క్యామియో రోల్ ప్లే చేశారు. ఇందులో కన్నడ ఇండస్ట్రీ హీరో శివరాజ్ కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్, బాలీవుడ్ నుంచి జాకీష్రాఫ్ ఈ మూవీ ను మలుపు తిప్పే మంచి పాత్రల్లో కనిపించారు. అయితే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ చిత్రంలో కనిపించిన నటుడు సునీల్.. మిగిలిన ఇండస్ట్రీ హీరోలు మంచి స్ట్రాంగ్ పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో కనిపిస్తే సునీల్ మాత్రం ఇందులో ఒక కమెడియన్ క్యారెక్టర్ లో కనిపించారు.

తాను చాలా సీరియస్ గా ఉంటున్నాను అని బిల్డప్ ఇచ్చే ఒక కామెడీ హీరో క్యారెక్టర్ లో సునీల్ అందరినీ మెప్పించాడు. కోలీవుడ్ ఆడియన్స్ కి ఈ క్యారెక్టర్ విపరీతంగా నచ్చినప్పటికీ తెలుగు ఆడియోస్ లో మాత్రం కొంతమంది సునీల్ ను తెగ ట్రోల్ చేస్తున్నారు. మిగిలిన ఇండస్ట్రీస్ నుంచి పవర్ఫుల్ క్యారెక్టర్స్ కోసం స్టార్ హీరోస్ ని సెలెక్ట్ చేసుకొని తెలుగు నుంచి సునీల్ లాంటి నటుడిని తీసుకొని ఒక కమీడియన్ గా అది కూడా ఒక కామిక్ హీరో లాగా చూపించడం పై వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది మూవీ హిట్ అయింది కాబట్టి కావాలని ఇలా నెగిటివ్గా వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు అని భావిస్తున్నారు.

Previous articleచిరంజీవి లాగానే విలన్ గా కెరీర్ మొదలెట్టి…హీరోలుగా మారిన 9 మంది నటులు ఎవరో తెలుసా.?
Next article72 ఏళ్ల రజనీకాంత్ 50 ఏళ్ల సీఎం యోగి కి కాళ్లకు మొక్కాల్సిన అవసరం ఏమిటి.? కారణం ఇదేనా.?