72 ఏళ్ల రజనీకాంత్ 50 ఏళ్ల సీఎం యోగి కి కాళ్లకు మొక్కాల్సిన అవసరం ఏమిటి.? కారణం ఇదేనా.?

Ads

ఇప్పటివరకు రాజకీయాలకు అతీతంగా ఉంటూ టాలీవుడ్, కోలీవుడ్ ,బాలీవుడ్.. ఇలా ప్రతి ఇండస్ట్రీలో తన స్టార్ డం ని కొనసాగిస్తున్న నటుడు రజనీకాంత్. అతనికి ఫాన్స్ ఎంతమంది ఉంటారు అనేది లెక్కపెట్టడం సముద్రంలో నీటి చుక్కలు ఎన్ని ఉంటాయి లెక్కపెట్టడంతో సమానమని అంటుంటారు. అయితే ఎప్పుడూ తన విషయాల్లో ఆచితూచి వ్యవహరించే రజినీకాంత్ చేసిన ఒక్క పని వల్ల ప్రస్తుతం ఎందరో అతన్ని విమర్శిస్తున్నారు.

అంతేకాదు ఈ విషయాన్ని రీసెంట్ గా జరిగిన మెగాస్టార్ ఇన్సిడెంట్ తో పోల్చి మరీ రీల్స్ పెడుతున్నారు. ఇంతక ముందు ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ దగ్గర సినీ పరిశ్రమ బాగుకోసం మాట్లాడడానికి వెళ్లిన చిరంజీవి ..కాస్త చేతులు కట్టుకున్నాడు అనేది ఓ పెద్ద పాయింట్ చేసి సోషల్ మీడియాలో నానా హంగామా చేశారు. అయితే ఇప్పుడు రజినీకాంత్ ఏకంగా ఒక రాజకీయ నాయకుడి కాళ్లకు మొక్కడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు.

Ads

ఎవరెస్టు శిఖరంలా ఇండస్ట్రీలో మెలుగుతున్న రజినీకాంత్.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగిని కలిసినప్పుడు ఆయన కాళ్లకు నమస్కారం చేయడం రజనీ ఫ్యాన్స్ కి కూడా నచ్చడం లేదు. మామూలుగా చేతులతో నమస్కరించడం లేక హ్యాండ్ షేక్ ఇవ్వడం సరిపోయే దానికి పాదాలకు నమస్కరించాల్సిన అవసరం ఏమిటి అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రశ్న.

72 ఏళ్ల రజనీకాంత్ 50 ఏళ్ల సీఎం యోగి కి కాళ్లకు మొక్కాల్సిన అవసరం ఏమిటి అని వస్తున్న ట్రోల్స్‌ ఎక్కువైపోతున్నాయి. మరోపక్క సీఎం యోగి ఒక సన్యాసి కావడంతో రజనీ అతని వయసు కంటే కూడా అతనిలోని సన్యాసికి గౌరవం ఇచ్చి ఆధ్యాత్మికత కోణంలో అలా చేశారు అన్న వాదన వినిపిస్తోంది. దీనికి తోడు త్వరలో రజనీకాంత్ కి రాజకీయ రంగు అంట నుండి అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

Previous articleసినిమా హిట్ అయ్యింది కాబట్టి ఇలా కామెంట్స్ చేస్తున్నారా.? ఆ క్యారెక్టర్ నిజంగానే అవసరమా.?
Next articleపెళ్లి చేసుకోబోయే అమ్మాయి అబ్బాయి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.?