Ads
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మెగాస్టార్ చిరంజీవి సినీపరిశ్రమలో స్టార్ హీరోగా మారిన తరువాత ఆయన తమ్ముడు నాగబాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా, హీరోగా ఆశించిన గుర్తింపు రాలేదు.
అయితే నాగబాబు హీరోగా రాణించలేకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విజయం పొందారు. ఇక చిరంజీవి చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ వచ్చిన కొద్దిరోజుల్లోనే వరుస విజయాలతో పవర్ స్టార్ గా ఎదిగారు. ఇది ఇలా ఉండగా మెగా ఫ్యామిలీలోని కొందరికి రెండు లేదా మూడు వివాహాలు కూడా జరిగాయి. అయితే మెగా ఫ్యామిలీలో రెండు, మూడు వివాహాలు చేసుకున్న వారు ఎవరో చూద్దాం.పవన్ కళ్యాణ్ :
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాల్సి వస్తే చాలా మంది ఆయన మూడు పెళ్లిళ్ల గురించే ఎక్కువగా మాట్లాడుతారు.పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి రాకముందు నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత తనతో నటించిన రేణు దేశాయ్ ని రెండవ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి విడాకులు ఇచ్చి తనతో తీన్మార్ మూవీలో నటించిన రష్యన్ అమ్మాయి అన్న లెజినోవాని మూడో పెళ్లి చేసుకున్నారు.విజయదుర్గ :
మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు హీరో సాయిధరమ్ తేజ్ తల్లి అయిన విజయదుర్గకి కూడా వివాహం కలిసి రాలేదు. ఆమె సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ పుట్టిన తరువాత భర్తతో విడాకులు తీసుకుంది. దాదాపు 15-20 ఏళ్లపాటు ఆమె విడిగానే ఉంది. ఇద్దరు కొడుకులు పెద్దయ్యాక విజయదుర్గ రెండో వివాహం చేసుకుంది.
Ads
శ్రీజ :
మెగాస్టార్ చిరంజీవి రెండవ కూతురు శ్రీజ వివాహ విషయంలో తప్పటడుగులు తప్పలేదు. శ్రీజ ముందుగా శిరీష్ భరద్వాజ్‌ను ప్రేమించి ఇంట్లో నుండి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. కూతురు పుటీనా తరువాత శిరీష్ కు విడాకులు ఇచ్చి, కళ్యాణ్‌దేవ్‌ను రెండవ వివాహం చేసుకుంది. ఇక రెండవ పాప పుట్టిన తరువాత ప్రస్తుతం విడిగా ఉంటోంది. అయితే కళ్యాణ్ దేవ్‌కు శ్రీజ విడాకులు ఇచ్చిందని, ఇస్తుందని వార్తలు షికారు చేస్తూనే ఉన్నాయి.అల్లు బాబి :
అల్లు ఫ్యామిలీని మెగా ఫ్యామిలీకి దూరంగా చూడలేం. వారంతా ఒక్కటిగానే ఉంటారు. అల్లు అరవింద్ పెద్ద అబ్బాయి అల్లు బాబి కూడా రెండు వివాహాలు చేసుకున్నారు. ఫస్ట్ భార్యకి కూతురు పుట్టిన తరువాత విడిపోయారు. ముంబైకి చెందిన డిజైనర్‌ను రెండవ వివాహం చేసుకున్నారు.
Also Read: టాలీవుడ్ లో కులాంతర వివాహాలు చేసుకున్న 8 మంది హీరోలు ఎవరో తెలుసా?