Ads
నందమూరి తారక రామారావు తెలుగు సినీ ఇండస్ట్రీలో మకుటంగా వెలిగిన ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ రంగమైన.. రాజకీయ రంగమైన ఎన్టీఆర్ స్టైల్ ఏ డిఫరెంట్. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి , కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ని కూడా ఢీకొట్టగలిగే ధైర్యం ఎన్టీఆర్ కే సొంతం. సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్ చెబుతూ ఉంటే ఆ టెంపో డిఫరెంట్ గా ఉంటుంది…ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకున్న గొప్ప నటుడు ఎన్టీఆర్.
రాజకీయాలలో అడుగుపెట్టి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆడపడుచుల కోసం ప్రత్యేకించి ఆయన ప్రవేశపెట్టిన అటువంటి పథకాలు వారికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఎన్టీఆర్కు హిందూధర్మం అన్న…హైందవ సాంప్రదాయాలు మరియు తెలుగు భాష అన్న ఎంతో ప్రీతి. అందుకే ఆయన తన కొడుకులకు కూతుర్లకు అలాగే వారి వారసులకు కూడా తనీ స్వయంగా ఎంచుకున్న పేర్లను నామకరణం చేశారు.
Ads
ఆయన తన ఏడుగురు కొడుకులకు అందరికీ కృష్ణ అనే పదం కలిసి వచ్చేలా హరికృష్ణ, రామకృష్ణ, సాయికృష్ణ, జయకృష్ణ, బాలకృష్ణ, మోహన కృష్ణ, జయశంకర్ కృష్ణ అని పేర్లు పెట్టుకున్నారు. అలాగే ఆయన నలుగురు కూతుళ్లకు చివర ఈశ్వరి అనే పేరు కలిసి వచ్చేలా లోకేశ్వరి, పురంధేశ్వరి, ఉమా మహేశ్వరి, భువనేశ్వరి అని పేర్లు పెట్టారు.
అలాగే మనవరాల విషయానికి వచ్చేసరికి పెద్ద కుమారుడు జయకృష్ణ కూతురుకి కుదిమిని, రెండవ కుమారుడి కూతుర్లకు శ్రీమంతుని, మనశ్విని అని పేర్లు పెట్టగా బాలకృష్ణ ఇద్దరి కూతుర్లకు బ్రాహ్మిణి, తేజస్విణి అని నామకరణం చేయడం జరిగింది. అలాగే ఆయన చిన్న కుమారుడు సాయి కృష్ణ కుమార్తెకు కూడా ఈషాణి అనే పేరును ఎన్టీఆర్ పెట్టారు. తేట తెలుగు తేనెలోకు…అన్నట్లుగా తెలుగుతనం బుట్టిపడేలా కమ్మని పేర్లను భావితరాలకు అందించిన ఎన్టీఆర్ నిజంగా తెలుగు తల్లి ముద్దుబిడ్డ.