మెగాస్టార్ తన కెరీర్లో కాదనుకున్న 8 సినిమాలు ఇవే

Ads

తెలుగులో చిరంజీవి క్రేజే వేరు. ఎంతమంది హీరోలు వచ్చినా టాలీవుడ్ మెగాస్టార్ మాత్రం ఆయనే. కొద్ది రోజులు ఫ్లాపులతో సతమతమైన మెగాస్టార్ మల్లి ఈ మధ్య వాల్తేరు వీరయ్య తో మంచి హిట్టు అందుకున్నారు. అయితే తన కెరియర్ లో హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా దాదాపు 155 చిత్రాలలో నటించిన చిరంజీవి ఎన్నో చిత్రాలని వద్దనుకున్నారు కూడా. అయితే ఇప్పటివరకు మెగాస్టార్ ఎనిమిది చిత్రాలను వదులుకోగా అందులో ఒక సినిమా మాత్రమే ఫ్లాప్ అయిన సినిమా అంట. మరి ఆ 8 సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..

మ‌న్నెంలో మొన‌గాడు :

కోతి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన మన్నెంలో మొనగారూ సినిమాలో మొదటిగా చిరంజీవిని హీరోగా అనుకున్న కానీ, అప్ప‌టికే చిరంజీవికి స్టార్ హీరో ఇమేజ్ రావ‌డంతో ఆ సినిమా వద్దనుకున్నారంట. దాంతో ఈ చిత్రం యాక్షన్ కింగ్ అర్జున్ చేతికి వెళ్లి సూపర్ హిట్అయింది.

ఆక‌రి పోరాటం :

చిరంజీవి మరియు శ్రీదేవి కాంబినేషన్లో ఈ సినిమాని వైజయంతి మూవీస్ నిర్మిడం అనుకున్న కానీ, అప్పుడు చిరంజీవి డేట్స్ కుదరకపోవడంతో ఈ సినిమా నాగార్జున చేతికి వెళ్లి బ్లాక్ బస్టర్ సాధించింది.

అసెంబ్లీ రౌడి :

మోహన్ బాబు కెరియర్ లో బ్లాక్ బస్టర్ చిత్రాలలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రం అసెంబ్లీ రౌడీ.
అయితే ఈ చిత్రం రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న‌ద‌నో, లేక త‌న డేట్స్ ఖాళీగా లేక‌నో చిరంజీవి ఈ ఆఫ‌ర్‌ని తిర‌స్క‌రించాడు.

నెంబ‌ర్ వ‌న్ :

ఈ సినిమాకి అన్నయ్య అనే టైటిల్ పెట్టి ఎస్వీ కృష్ణారెడ్డి చిరంజీవితో తీద్దామనుకున్నారట. అయితే అప్ప‌టికే కృష్ణారెడ్డి అన్ని చిన్న సినిమాలు చేసి ఉండ‌డంతో ఆయ‌న‌పై న‌మ్మ‌కం లేక ఈ సినిమాను చిరంజీవి రిజెక్ట్ చెయ్యడంతో ఈ సినిమా కృష్ణ దగ్గరికి వెళ్ళింది. ఇక ఈ చిత్రం కూడా అప్పట్లో సూపర్ హిట్ సాధించింది.

Ads

సాహ‌స‌వీరుడు సాగ‌ర క‌న్య :

రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి ఎక్స్పెక్టేషన్స్ మధ్య విడుదలై మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమాలో వెంకటేష్ కన్నా ముందు రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని చిరంజీవి-మాదురి దీక్షిత్‌ల‌తో చేయాల‌నుకున్నారు. అయితే అప్పుడు కొన్ని ఫ్లాపులతో సతమతమవుతున్న చిరంజీవి ఇలా కొత్త కథ అటెంప్ట్ చేయ‌డానికి ఇష్టపడక వదులుకున్నారట.

ఆంధ్రావాలా :

చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాలలో ఫ్లాప్ పైన ఏకైక చిత్రం ఆంధ్రావాలా మాత్రమే. మెగాస్టార్ చిరంజీవి కోస‌మే ద‌ర్శ‌కుడు పూరిజ‌గ‌న్నాథ్ రాసుకున్న స్క్రిప్ట్ ఇది. కానీ ఈ స్క్రిప్ట్ న‌చ్చ‌క మెగాస్టార్ దీనిని కాదనుకోవడంతో ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ చేతిలోకి వెళ్ళింది.

చంద్ర‌ముఖి :

తెలుగు మరియు తమిళ భాషల్లో ఈ చిత్రం ఎంత విజయం సాధించిందో మన అందరికీ తెలుసు.
క‌న్న‌డ‌లో ఆప్త‌మిత్రుడు చూశాక అది తెలుగులో చిరంజీవికి సూట్ అవుతుంద‌ని ద‌ర్శ‌కుడు వీ.ఎన్‌.ఆదిత్య చిరుని అడిగారు. అయితే ఈ సినిమాని చిరంజీవి కాదనడంతో అది రజినీకాంత్ కి వెళ్ళింది.

టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు :

ప్ర‌స్తుతం ర‌వితేజ హీరోగా షూటింగ్ జరుగుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు. ఈ సినిమాని ముందుగా దర్శకుడు చిరంజీవిని అడగక ఆయన ఒప్పుకోకపోవడంతో రవితేజాన్ని తీసుకున్నారట.

Previous articleగర్భగుడి వెనుక భాగాన్ని ఎందుకు మ్రొక్కుతారు.. కారణం ఇదేనా..?
Next articleతెలుగు తీయదనాన్ని చాటుతూ…తన వారసులకు అద్భుతమైన పేర్లు పెట్టిన ఎన్టీఆర్…