‘వంటలక్క’ గా పాపులర్ అయిన ‘ప్రేమి విశ్వనాథ్’ ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేదో తెలుసా?

Ads

‘వంటలక్క’ఈ పేరు తెలుగు రాష్ట్రాలలో అత్యంత పాపులర్ అయిన పేరు. వంటలక్కగా నటించిన నటి పేరు ప్రేమి విశ్వనాథ్. ఆమె కార్తీక దీపం సీరియల్ తో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది. ఈ సీరియల్ లో ప్రేమి దీప అనే క్యారెక్టర్ చేసింది. ఆమెను ఈ సీరియల్ లో వంటలక్క అని పిలుస్తారు.

ఆమెను అందులో అందరు వంటలక్క అని పిలుచుకుంటారు. ఈ సీరియల్ బుల్లితెర పై సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇటీవలే ఈ సీరియల్ కి శుభం కార్డ్ వేశారు. ఈ సీరియల్ ‘స్టార్ మా’ఛానల్ లో టెలికాస్ట్ అయ్యేది. ఈ సీరియల్ వచ్చే సమయంలో ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళు రిమోట్ లను దాచి పెట్టి, ఈ సీరియల్ ను చూసేవారు. వంటలక్క ఈ సీరియల్ కు లీడ్ రోల్ పోషించింది. ప్రేమీ విశ్వనాథ్ నటనకు ఫ్యాన్ ఫాలోయింగ్ హీరోయిన్ల కంటే ఎక్కువగా ఏర్పడింది. ఆమెను బయట కూడా వంటలక్క అని పిలుసస్తున్నారు. అంతలా తెలుగువారికి దగ్గర అయిన ఈ నటి గురించి ఇప్పుడు చూద్దాం.. ప్రేమి విశ్వనాథ్ కేరళలోని ఎడప్పల్లిలో 1991లో డిసెంబరు 2న జన్మించింది. ఆమె తండ్రి పేరు విశ్వనాథ్, తల్లి పేరు కాంచన.ప్రేమి ‘లా’ పూర్తి చేసి, కొచ్చిలోని ఒక కంపెనీకి లీగల్‌ అడ్వైజర్‌గా కొన్నాళ్ళు పని చేసింది.ఆమెకు ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అందువల్ల కొన్ని పెళ్లి వేడుకలకు ఫొటోగ్రాఫర్ కూడా పని చేసేదట.ప్రేమి యాక్టింగ్ చయక ముందు మోడలింగ్ చేసి, అక్కడ కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది.ప్రేమి విశ్వనాథ్ ‘కరతముత్తు’ అనే మలయాళంలో వచ్చిన సీరియల్ ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఇక అదే సీరియల్ ను కొన్ని మార్పులు చేసి తెలుగులో ‘కార్తీక దీపం’ గా రీమేక్ చేశారని సమాచారం.ప్రేమి విశ్వనాథ్ ‘సొలొమాన్ 3డి’ అనే సినిమాలో కూడా నటించింది.

Ads

కేరళలో ప్రఖ్యాతి చెందిన జోతిష్యుడు అయిన డా.టి.ఎస్‌. వినీత్‌ భట్‌ ను ప్రేమి విశ్వనాథ్ ప్రేమించి వివాహం చేసుకుంది.

ప్రస్తుతం ప్రేమి విశ్వనాథ్ కు తెలుగు ఇండస్ట్రీలో పలు సినిమాలలో ఆఫర్స్ వస్తున్నాయంట. అయితే ఆమె ఇప్పటివరకు ఏ సినిమాకి కూడా కమిట్ అవలేదు.
Also Read: యాక్టర్ రంగనాథ్ చనిపోయే ముందు గోడ పై ఏమని రాశారో తెలుసా?

 

View this post on Instagram

 

A post shared by Premi Viswanath (@premi_vishwanath)

Previous articleసినిమాల్లో హీరో హీరోయిన్లు వేసుకున్న “కాస్ట్యూమ్స్” ని.. సినిమా అయ్యాక ఏం చేస్తారు..?
Next articleSuma Kanakala : చ‌లాకీగా ఉండే సుమ‌.. ఆ ఒక్క విష‌యంలో రోజు బాధ‌ప‌డుతుంద‌ట‌..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.