సినిమాల్లో హీరో హీరోయిన్లు వేసుకున్న “కాస్ట్యూమ్స్” ని.. సినిమా అయ్యాక ఏం చేస్తారు..?

Ads

ఒక సినిమాని కానీ ఒక సీరియల్ ని కానీ తెర మీదకి తీసుకురావడం అంత సులభం కాదు. ఎంతో కష్టపడితే కానీ ఒక సినిమా తెర మీదకి రాదు. పైగా షూటింగ్ సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క కాస్ట్యూమ్ ని వేసుకుంటారు. పాత్రకి అనుగుణంగా బట్టలు ఉంటాయి. కాస్ట్యూమ్స్ ని కాస్ట్యూమ్ డిజైనర్స్ డిజైన్ చేస్తారు. సన్నివేశానికి తగ్గట్టుగా నటీనటులు దుస్తులు ఉండేటట్టు చూస్తారు.

అందంగా కనపడడానికి ఒక రకం బట్టలు సింపుల్ గా కనపడడానికి ఇంకో రకం ఇలా సందర్భానికి తగ్గట్టుగా దుస్తులు ఉంటాయి. అయితే ఎప్పుడైనా మీకు ఈ సందేహం కలిగిందా…

సీరియల్స్ లో కానీ సినిమాల్లో కానీ ఒకసారి వేసుకున్న బట్టల్ని మళ్లీ ఏం చేస్తారు అని… ఈ సందేహం నాకు కూడా ఎన్నోసార్లు కలిగింది. అసలు ఈ బట్టల్ని ఏం చేస్తారు ఒకసారి వేసుకున్న కాస్ట్యూమ్స్ ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తారా..? పారేస్తారా..? దీని వెనుక కారణాన్ని ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా సినిమాల్లో హీరో హీరోయిన్లు ఎక్కువ డ్రస్సులు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ బట్టలు కనుక నటులు నచ్చితే వాటిని తీసుకువెళ్ళిపోతారు. ఇంకొంతమంది దుస్తుల్ని వేలం వేస్తారు. డబ్బులని ఛారిటీ కి ఇచ్చేస్తారు. ఉదాహరణకి దూకుడు సినిమా చూస్తే మహేష్ బాబు కి సమంత కి ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ ని డిజైన్ చేశారు సినిమా అయ్యాక సమంత సినిమాలో ఉపయోగించిన మహేష్ బాబు కాస్ట్యూమ్స్ ని వేలం వేసి వచ్చిన డబ్బుల్ని ఛారిటీకి ఇచ్చింది. అలానే గబ్బర్ సింగ్ లో బట్టల్ని కూడా స్వచ్ఛంద సంస్థకు సహాయం చేయడం కోసం వేలం వేయడం జరిగింది.

Ads

ఈ మధ్యకాలంలో కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం అనేది తగ్గుతూ వచ్చింది. పర్సనల్ స్టైలిష్ ఏ బట్టల్ని ఇస్తున్నారు. ఒకవేళ కనుక స్పెషల్ గా బట్టలు కావాలంటే అప్పుడు మాత్రమే డిజైనర్లు డిజైన్ చేస్తున్నారు. ఎక్కువగా డిజైనర్ల నుండి అద్దెకి తెచ్చుకుంటున్నారు.

షూటింగ్ అయిపోయిన తర్వాత వాటిని ఇచ్చేస్తారు. రాములో రాముల పాట కోసం పూజ హెగ్డే మనీష్ మల్హోత్రా డ్రెస్ అద్దెకి తెచ్చుకున్నారు. కొన్ని ప్రొడక్షన్ హౌస్లు హీరో హీరోయిన్లు ఉపయోగించిన కాస్ట్యూమ్స్ ని బ్యాగ్రౌండ్ డాన్సర్లకి వాడుతూ ఉంటారు.

బృందావనం సినిమాలో కాజల్ వేసుకున్న డ్రెస్సుని మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ఒక సాంగ్ బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ కి ఉపయోగించారు.

రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ వేసుకున్న డ్రెస్ ఒకటి రంగులరాట్నం సినిమాలో హీరోయిన్ ఓ సాంగ్ లో వేసుకుంది.

ఈ రెండు సినిమాలకి ప్రొడ్యూసర్ అన్నపూర్ణ స్టూడియోస్. ఇలా మనకి తెలియకుండా కాస్ట్యూమ్స్ ని రిపీట్ చేస్తూ ఉంటారు. హీరోలు ఎక్కువగా ఆల్రెడీ ఉన్న బ్రాండెడ్ బట్టల్ని వేసుకుంటారు.

 

Previous articleఅమితాబ్ బచ్చన్ ఇంట్లో ”4 కోట్ల బుల్ పెయింటింగ్”… దాని వెనుక ఇంత కథ ఉందా…?
Next article‘వంటలక్క’ గా పాపులర్ అయిన ‘ప్రేమి విశ్వనాథ్’ ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేదో తెలుసా?