నటి రోజా తండ్రి ఎవరో, ఆయన నేపద్యం ఏమిటో తెలుసా..?

Ads

రోజా, ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 90లలో కథానాయకగా సిల్వర్ స్కీన్ పై అద్భుతమైన పాత్రలలో నటించి, మెప్పించిన నటి రోజా. ఆమె తెలుగులోనే కాకుండా వేరే భాష‌ల‌లోను త‌న న‌ట‌న‌తో ఆడియెన్స్ ని అల‌రించింది. అందం కన్నా నటన ముఖ్యమని, నలుపులో కూడా అందం ఉందని నిరూపించిన ఏకైక హీరోయిన్ రోజా అని చెప్పవచ్చు. సినీ పరిశ్రమలో రాణించిన రోజా, రాజకీయాల్లోనూ రాణిస్తూ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం మంత్రి పదవిలో ఉన్న రోజా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె మాటకు మాట చెప్పడమే కాకుండా, ఎలాంటి నాయకుడిని అయినా సరే తనకున్నటు వంటి వాక్చాతుర్యంతో నిలదీస్తుంది. ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో పుట్టిన ఆమె, సినీ ఇండస్ట్రీకి రావడం, అటు తరువాత రాజకీయాల్లో ప్రవేశించి, అక్కడ నిలదొక్కుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఇక రోజా ఈ స్థాయికి చేరడంలో ఆమె పడిన శ్రమతో పాటుగా ఆమె ఫ్యామిలీ కూడా మద్దతుగా నిలిచింది.
రోజా ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో నాగరాజారెడ్డి, లలితా రెడ్డి దంపతులకు జన్మించారు. ఆమె అసలు పేరు శ్రీలత రెడ్డి. ఆమె తల్లిదండ్రులు మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. ఆమె తండ్రి నాగరాజారెడ్డి డాక్యుమెంటరీ ఫీల్డ్ లో సౌండ్ ఇంజనీర్ గా పనిచేసేవారు. ఇక ఆమె తల్లి లలిత నర్సుగా చేసేవారు. రోజాకు ఇద్దరు సోదరులున్నారు. వారు కుమారస్వామి రెడ్డి, రామ్ ప్రసాద్ రెడ్డి. పొలిటికల్ సైన్స్ లో పీజీని నాగార్జున యునివర్సిటీ లో పూర్తి చేసింది. ఆమెకు చదువుకునే రోజుల్లోనే యాక్టింగ్ పై ఆస‌క్తి ఏర్పడడంతో రోజా సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది.

Ads

సీతారత్నం గారి అబ్బాయి, ముఠా మేస్త్రి, బొబ్బిలి సింహం, భైరవ ద్వీపం, శుభలగ్నం లాంటి సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అంతే కాకుండా తమిళంలో డైరెక్టర్ ఆర్ కె సెల్వమణి దర్శకత్వంలో చామంతి అనే మూవీతో కోలీవుడ్ లో అడుగు పెట్టిన రోజా, అక్కడ కూడా చాలా సినిమాలలో నటించి హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉన్నప్పుడే సెల్వమణి ప్రేమించి, పెళ్లి చేసుకుంది. వీరికి హంసమాలిక, కృష లోహిత్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇండస్ట్రీలో పాపులారిటీ పొందిన రోజా, ఆ తరువాత పొలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇంకా బుల్లితెర షోల ద్వారా కూడా రోజా ఆడియెన్స్ కు మరింత చేరువయ్యారు.

Also Read: సూపర్ హిట్ సినిమాలలో మంచి పాత్రలను రిజెక్ట్ చేసిన 8 మంది హీరోయిన్లు ఎవరో తెలుసా?

Previous articleఅంబులెన్స్ కు ‘108’ నంబర్ పెట్టడం వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసా?
Next articleహీరో విక్టరీ వెంకటేష్ ముగ్గురు కుమార్తెలు ఏం చేస్తుంటారో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.