Ads
Veera Simha Reddy Review in Telugu:
నటులు: బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ తదితరులు
దర్శకుడు: గోపీచంద్ మలినేని
నిర్మాతలు: మైత్రి మూవీ మేకర్స్
సంగీతం: తమన్
రిలీజ్ డేట్: జనవరి 12,2023
Veera Simha Reddy Review: బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమాతో వచ్చాడు. బాలయ్య సరసన శృతిహాసన్ నటిస్తున్నారు. ఇంకో బాలయ్య పక్కన హనీ రోజ్ నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ బాలయ్య చెల్లెలిగా దునియా విజయ్ ఆమె భర్తగా నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ని నిర్మిస్తుండగా తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
కథ:
జయ సింహా రెడ్డి (బాలకృష్ణ) ఇస్తాంబుల్ లో హోటల్ బిజినెస్, ఆటోమొబైల్ బిజినెస్ చూసుకుంటూ తన తల్లితో కలిసి జీవిస్తూ ఉంటాడు. ప్రేమించిన ఈష (శ్రుతిహాసన్)ప్రేమిస్తాడు. అయితే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆ క్రమంలో తన తండ్రి వీరసింహారెడ్డి బ్రతికే ఉన్నాడని, కర్నూల్ లో పులిచర్ల ప్రాంతానికి పెద్ద వీరసింహారెడ్డి అని తెలుస్తుంది. అయితే ఊహించని పరిణామాల మధ్య వీరసింహారెడ్డి కొడుకు జైసింహా పెళ్లి చేయడానికి ఇస్తాంబుల్ కి వెళ్తాడు. అప్పటికే వీరసింహారెడ్డిని ఎప్పట్నుంచో చంపడం కోసం చూస్తున్న ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్) భానుమతి(వరలక్ష్మి) ప్లాన్ ప్రకారం కూడా తన గ్యాంగ్ తో ఇస్తాంబుల్ వెళ్ళి, వీరసింహారెడ్డితో తలపడతాడు. మరి ఆ తరువాత ఏం జరిగింది? అసలు వీరసింహారెడ్డి, ప్రతాప్ రెడ్డిల మధ్య పగకు కారణం ఏమిటి? ఈ స్టోరీలో భానుమతి పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలకు జవాబు ఈ సినిమా.
నటీనటుల పనితీరు:
నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటు తండ్రిగా, అటు కొడుకుగా రెండు పాత్రలలో జీవించేశాడు. జయ సింహా రెడ్డిగా కనిపించడానికి కొంచెం కష్టపడినా, వీరసింహారెడ్డిగా వెండితెరపై మాస్ గా విశ్వరూపం చూపించాడు. ప్రధానంగా వీరసింహారెడ్డిగా బాలకృష్ణ చెప్పిన డైలాగులు మరియు యాక్షన్ సీన్స్, మాస్ ప్రేక్షకులకు, బాలయ్య ఫ్యాన్స్ కు పండగే. ఇక భానుమతి క్యారెక్టర్ కు వరలక్ష్మీ శరత్ కుమార్ ఆమె జీవించిందనే చెప్పాలి. నటనను పూర్తిస్థాయిలో ప్రదర్శించే పాత్ర వరలక్ష్మీకి దొరికింది. మలయాళ హీరోయిన్ హనీ రోజ్ నటనతో, గ్లామర్ తో ఆకట్టుకుంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా పర్వాలేదనిపించాడు శ్రుతిహాసన్ పాటలు, మూడు సీన్స్ కు మాత్రమే పరిమితం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు:
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ మూవీకి సెకండ్ హీరో అనవచ్చు. ఆయన ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవల్ కి తీసుకెళ్లింది. యాక్షన్ సీన్స్ కి నేపధ్య సంగీతంతో థియేటర్లలో పూనకాలే అన్నటుగా ఉంది. పాటలు బాగున్నాయి. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్ అలరించేలా ఉన్నాయి. పెళ్లిల పందిరిలో ఫైట్ సీన్స్ మరియు మైన్ లో ఫైట్ సీన్ సినిమాకి హైలైట్స్ గా అని చెప్పవచ్చు. సాయిమాధవ్ బుర్రా రాసిన మాటలు పదునుగా ఉన్నాయి. పొలటికల్ పంచ్ డైలాగులతో థియేటర్ స్పందన అదిరిపోయింది. దర్శకుడిగా గోపీచంద్ మలినేని తన సత్తా మరోసారి చాటుకున్నాడు. కొన్ని చోట్ల తడబడ్డాడు.
ప్లస్ పాయింట్స్:
బాలయ్య నటన,
తమన్ బీజీయమ్
వరలక్ష్మి శరత్ కుమార్ నటన,
యాక్షన్ సీన్స్,
పంచ్ డైలాగ్స్,
Ads
మైనస్ పాయింట్స్:
స్టోరీ లైన్,
సాగదీసిన డ్రామా
రేటింగ్ :3/5
Also Read: దళపతి విజయ్ “వారసుడు” మూవీ రివ్యూ & రేటింగ్