Ads
తెలుగు సినీ పరిశ్రమలో హీరో విక్టరీ వెంకటేష్ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సృష్టించుకున్నారు. దగ్గుబాటి కుటుంబ వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, అనతికాలంలోనే స్టార్ డమ్ ని పొంది, అగ్రహీరోగా కొనసాగుతున్నారు.
Ads
ఇక వెంకటేష్ అమెరికాలో చదువుతున్న సమయంలోనే ఆయన తండ్రి అయిన ప్రొడ్యూసర్ రామానాయుడు కోరిక మేరకు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. వెంకటేష్ కెరీర్ లో నటించిన సినిమాలలో రాజా అనే పేరుతో వచ్చిన చిత్రాలు నాలుగు ఉన్నాయి. మరి వాటిలో ఎన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయో ఇప్పుడు చూద్దాం.వెంకటేష్ సురేష్ ప్రొడక్షన్స్ లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మొదటిసారిగా కలియుగ పాండవులు సినిమాలో నటించారు. 1986 లో విడుదల అయిన ఈ మూవీ సూపర్ హిట్ గా అయ్యింది. ఇక అప్పట్నుండి వెంకటేష్ పై ఆడియెన్స్ అభిమానం పెంచుకున్నారు. ఆ తరువాత 1990 లో బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ‘బొబ్బిలి రాజా’ విడుదల అయ్యింది. ఈ మూవీని కమర్షియల్ సినిమాగా చేశారు. ఆశించినట్టుగానే ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో వెంకటేష్ ను అగ్ర హీరోగా మారారు.ఆ తరువాత 1993లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ‘కొండపల్లి రాజా’ సినిమా విడుదల అయ్యింది. ఈ చిత్రంలో టాప్ హీరోలుగా ఉన్న వెంకటేష్, సుమన్ పోటీ పడి నటించారు. ఈ చిత్రం కూడా హిట్ గా నిలిచింది.1995 లో డైరెక్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి రాజా’ సినిమా విడుదల అయ్యింది. వెంకటేష్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించి, మెప్పించారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం పొందలేదు.
1999లో ముప్పలనేని శివ దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై వచ్చిన సినిమా ‘రాజా’ విడుదలైంది. ఈ మూవీలో వెంకటేష్ సౌందర్య హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ మూవీ ఒక తమిళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాడమే కాకుండా 3 సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ను పొందింది.‘రాజా’ అనే టైటిల్ తో వచ్చిన వెంకటేష్ 4 చిత్రాల్లో పోకిరి రాజా మాత్రమే నిరాశ పరిచింది. మిగతా 3 చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.
Also Read: సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ హీరోయిన్స్ గా సక్సెస్ కానీ సెలబ్రిటీ డాటర్స్