టాలీవుడ్ విల‌న్‌ రామిరెడ్డి.. ఇండస్ట్రీకి రాక ముందు ఏం పని చేసేవారో తెలుసా?

Ads

ఒకప్పుడు తెలుగు సినిమాలలో విలనిజంతో భయపెట్టి, సరికొత్త విలనిజాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన విలక్షణ నటుడు సీనియర్ యాక్టర్ రామి రెడ్డి. ఆయన గురించి తెలుగు ఇండస్ట్రీలో తెలియనివారుండరు. రామి రెడ్డి గురించి ఈ తరం ఆడియెన్స్ కి అంతగా తెలియదు. కానీ 90వ దశకంలోని ప్రేక్షకులకు బాగా సూపరిచితమే. ఆయన విలన్ పాత్రలలో ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు.

Ads

ఆయన సినిమాల్లో పెద్ద బొట్టు, ఎరుపెక్కిన కళ్లు, తనదైన బాడీ లాంగ్వేజ్ తో ఆడియెన్స్ ని భయపెట్టిన విలన్ గా రామిరెడ్డి పాపులర్ అయ్యాడు. సాధారణంగా ఒక మూవీలో విలన్ గా గుర్తింపు వచ్చిందంటే వరుసగా అవకాశాలు వచ్చేవి. అలా రామిరెడ్డి వరుస ఆఫర్స్ తో చాలా చిత్రాల్లో నటించి విలన్ గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయన నటించిన సినిమాలలో పెద్దరికం, రాములమ్మ, అమ్మోరు లాంటి చిత్రాల్లో ఆయన విలనిజం మరో రేంజ్ లో ఉంటుందని చెప్పవచ్చు. ఇక విలన్ పాత్రలో ఆయన నటనకు అప్పట్లో ప్రేక్షకులు ఎంతగా తిట్టుకున్నారో వేరే చెప్పక్కర్లేదు.
రామిరెడ్డి ఏదైనా సినిమా ఈవెంట్స్ లో కనిపించినా, బయట ఎక్కడైనా కనిపించినా సరే ఆడియన్స్ ఎంతగానో భయపడేవారట. అప్పట్లో అది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. నటుడిగా ఎంతో పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్న రామిరెడ్డి 55 సంవత్సరాల వయస్సులోనే కన్నుమూశారు. అయితే లివర్ కు సంబంధించిన వ్యాధికి వచ్చినప్పటి నుండి ఆయన నరకం అనుభవించారు. దాని కారణంగా ఆయన గుర్తుపట్టలేనంత సన్నగా అయ్యారు. చాలా కాలం పాటు ఆ వ్యాధితో ఇబ్బంది పడి, చివరకు 2011 లో తుది శ్వాస విడిచారు.
రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని ఓబులంవారి పల్లెలో జన్మించారు. అయితే ఆయన చదువుకున్నది మాత్రం హైదరాబాద్ లోనే. చదువు పూర్తి అయిన తరువాత రామిరెడ్డి ఒక ఉర్దూ పత్రికలో జర్నలిస్ట్ గా పని చేశారు. ఆ సమయంలోనే సినిమాల పై ఆసక్తి కలగడంతో నిర్మాతల చుట్టూ తిరిగి, నటుడిగా అయ్యేందుకు ప్రయత్నాలు చేసేవాడు. రామిరెడ్డి ఆహార్యం చూసిన దర్శకులు విలన్ పాత్రలకు అయితే సరిపోతారని భావించి తమ సినిమా కోసం ఎన్నుకున్నారట. అలా ఆయన తొలి చిత్రంతోనే విలన్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. అప్పటి నుండి విలన్ గా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు.

Also Read: మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత భ‌ర్త నేపద్యం ఏమిటో తెలుసా?

Previous articleవాల్తేరు వీరయ్య సినిమాలోని విలన్ బాబీ సింహా బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా?
Next articleవెంకటేష్ సినిమాలలో ‘రాజా’ అనే టైటిల్ తో వచ్చిన వాటిలో ఏ మూవీ ఫ్లాప్ అయ్యిందో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.