Ads
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడి ఇప్పుడు థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా తెలుగుతో పాటు, తమిళంలో కూడా విడుదల చేశారు. గోవర్ధన్ అనే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి, అతనికి ఇద్దరు అన్నలు, కుటుంబ బాధ్యతలు మొత్తం కూడా గోవర్ధన్ చూసుకోవడం, అతని జీవితంలో జరిగిన సంఘటనలు అనే విషయం చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. మిడిల్ క్లాస్ కుటుంబాలలో జరిగే విషయాలను ఈ సినిమాలో చూపించడానికి ప్రయత్నించారు.
ఈ సినిమా మీద మిక్స్డ్ టాక్ వస్తోంది. కొన్ని సీన్స్ సరిగ్గా రాసుకోలేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. కొన్ని సీన్స్ అసలు చూడడానికే ఇబ్బందిగా ఉన్నాయి అని అంటున్నారు. అందులో సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్ ఒకటి. హీరో తర్వాత ఫారిన్ వెళ్తాడు. అక్కడ ఒక సందర్భంలో హీరో చేతిలో డబ్బులు ఉండవు. ఈ కారణంగా తనని తాను అమ్ముకునే వ్యాపారంలోకి దిగాలి అని అనుకుంటాడు. హీరో అలాంటి వ్యక్తి అనుకొని కొంత మంది అమ్మాయిలు అతనికి డబ్బులు ఇచ్చి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. ఈ సీన్ కామెడీ కోసం రాశారు. కానీ చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది.
Ads
అసలు ఇలాంటి సీన్ పెట్టాలి అనే ఆలోచన ఎలా వచ్చింది అంటూ కామెంట్స్ రావడం మొదలు అయ్యాయి. సాధారణంగా ఇలాంటి సీన్ ఒక అమ్మాయి విషయంలో జరిగితే అది ఒక సీరియస్ సీన్ అయిపోతుంది. అసలు ఎవరి విషయంలో జరిగినా కూడా ఇలాంటి సీన్ రాయడం అనేది కరెక్ట్ కాదు. అలాంటిది, “ఇలాంటి సీన్ పెట్టి, అది కూడా కామెడీ చేయాలి అని అనుకోవడం ఎంత వరకు సరైన విషయం?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదొక్కటి మాత్రమే కాదు. ఇలాంటి సీన్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. కానీ అవన్నీ లాజిక్ లేవు అని నవ్వుకొని వదిలేసేలాగా ఉన్నాయి. కానీ ఈ సీన్ మీద మాత్రం కామెంట్స్ వస్తున్నాయి.
ALSO READ : ఫ్యామిలీ స్టార్ సినిమాలో విజయ్ దేవరకొండ బామ్మగా నటించిన ఈ మహిళ ఎవరో తెలుసా..?