ఫ్యామిలీ స్టార్ సినిమాలో విజయ్ దేవరకొండ బామ్మగా నటించిన ఈ మహిళ ఎవరో తెలుసా..?

Ads

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఈ నెల విడుదల అయ్యింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమ్ అవుతోంది. గోవర్ధన్ అనే ఒక వ్యక్తి చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో పాటు, అతని కుటుంబ సభ్యులు కూడా చాలా హైలైట్ అయ్యారు. వారిలో ముఖ్యంగా హైలైట్ అయ్యారు విజయ్ దేవరకొండ బామ్మ పాత్ర పోషించిన వ్యక్తి. ఆమెని మనందరం చాలా సినిమాల్లో చూసాం. తెలుగు ఆవిడ కాకపోయినా కూడా చాలా తెలుగు సినిమాల్లో నటించారు. ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్, మహేష్ బాబు, అభినయ నాయనమ్మగా ఈవిడ నటించారు. ఈమె పేరు రోహిణి హట్టంగడి. రోహిణి పూణేలో పుట్టారు.

vijay devarakonda grand mother in family star

Ads

మరాఠీతో పాటు, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, గుజరాతి సినిమాల్లో కూడా చేశారు. థియేటర్ ఆర్టిస్ట్ తో పాటు, రోహిణి సినిమా ఆర్టిస్ట్ కూడా. సినిమాలతో పాటు, సీరియల్స్ లో కూడా నటించారు. తెలుగులో 1991 లో వచ్చిన సీతారామయ్యగారి మనవరాలు సినిమాతో కెరీర్ మొదలు పెట్టారు. అంతకుముందు కొన్ని హిందీ, కన్నడ, మలయాళం సినిమాలతో పాటు, గాంధీ అనే ఇంగ్లీష్ సినిమాలో కూడా నటించారు. ఆ తర్వాత తెలుగులో భలే పెళ్ళాం, టాప్ హీరో, లిటిల్ సోల్జర్స్, శిరిడి సాయి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన రామయ్య వస్తావయ్య, బ్రహ్మోత్సవం, నితిన్ హీరోగా నటించిన చల్ మోహన్ రంగా, ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించారు.

రోహిణి నటించిన ప్రతి సినిమా ఆమెకి చాలా గుర్తింపు తీసుకొచ్చింది. హిందీ, మరాఠీ భాషల్లో సీరియల్స్ లో నటించారు. 1977లో జయదేవ్ తో రోహిణి పెళ్లి జరిగింది. 2008లో జయదేవ్ తుది శ్వాస విడిచారు. ఇన్ని సంవత్సరాలు తన నటనకి రోహిణి ఎన్నో పురస్కారాలు కూడా అందుకున్నారు. ప్రతి భాషలో కూడా గుర్తుండిపోయే పాత్రల్లో నటించి, భారతదేశ సినిమా ఇండస్ట్రీలోనే గొప్ప నటిగా పేరు పొందారు. ఇప్పటికి కూడా రంగస్థలంతో పాటు, సినిమాల్లో, సీరియల్స్ లో కూడా నటిస్తూ అలరిస్తున్నారు.

ALSO READ : “అఖండ”లో ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు..? అసలు హీరోయిన్ ఏం చేసింది..?

Previous articleహిందూ సంస్కృతిని పాటిస్తున్న 8 మంది విదేశీ క్రికెటర్లు..! లిస్ట్ లో ఆ దేశం వాళ్ళే ఎక్కువ.!
Next articleబాలకృష్ణ భార్య వసుంధర గారి తండ్రి ఎవరో తెలుసా..? ఆయన ఏం చేస్తారంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.