Ads
భారతదేశంలో దేవుళ్ళ అందరి లో కళ్ళ వినాయకుడికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మనం ఏ పని చేసిన, ఏ పూజ చేసినా ముందుగా నాయకుడు పూజతోనే మొదలుపెడతాం.
మనం చేసే పనులకు, పూజలకు, శుభకార్యాలకు విజ్ఞులు రాకుండా ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తాం. అలాగే మన భారత దేశంలో వినాయక చవితికి ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది.
మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వినాయక చవితిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో కాణిపాకం వినాయక ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. పలు వినాయక ఆలయాల్లో అక్కడ పద్ధతులు ప్రకారం పూజ చేస్తే వినాయకుడు మన కోరికలు విని కరుణిస్తాడు అని నమ్మకాలు కూడా ఉంటాయి. అయితే తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా పట్టుకోటై అనే గ్రామంలో పురాతన వనేశ్వర స్వామి ఆలయం ఉంది.
Ads
ఈ ఆలయంలో అమ్మవారి గుడికి కుడి పక్కన వినాయకుడి ఆలయం కూడా ఉంది. ఇక్కడ వినాయకుడికి పూజలు చేసిన అనంతరం వినాయకుడి చెవిలో పువ్వులు పెడతారు. ఆయన కుడిచేవిలో పువ్వు లోపలికి వెళితే ఆయన మన కోరికలు విన్నట్టు ఇక్కడి ప్రజలు నమ్మకం. ఏ ఆలయంలో లేని విశిష్టత ఈ ఆలయంలో ఉండడంతో భక్తులు వినాయకుడికి పూజలు చేయడానికి అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వినాయకుడు ఆలయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా అవుతుంది.
watch video :