Ads
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం నాడు జరిగిన మ్యాచ్ లో భారత్ పై ఆస్ట్రేలియా విజయం సాధించి, ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది.
అయితే ఈ మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా వేసిన స్లో బాల్ కు ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఎల్బీడబ్ల్యూ అయ్యి, రివ్యూ తీసుకోకుండానే పెవిలియన్ కు చేరాడు. అయితే రీప్లేలో నాటౌట్ గా తేలింది. ప్రస్తుతం ఈ విషయం వివాదాస్పదం అవుతోంది.
ప్రపంచకప్ ఫైనల్ లో ఇంట్రెస్టింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ కి లక్షా 30 వేలమంది హాజరు అయ్యారు. భారతీయ అభిమానుల నినాదాలతో స్డేడియం మార్మోగిపోయింది. ఈ క్రమంలో క్రికెటర్లు ఒత్తిడికి లోనయ్యారు. వేలాదిమంది ప్రేక్షకుల మధ్య, అది కూడా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కావటంతో క్రికెటర్లతో పాటుగా అంపైర్లు సైతం తడబడ్డారు.
ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అవుట్ అవడం చర్చనీయాంశంగా మారింది. బుమ్రా బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యి, పెవిలియన్ చేరాడు. కానీ రీప్లేలో అది నాటౌట్ గా తేలింది. బుమ్రా వేసిన స్లో బాల్ ని స్మిత్ డిఫెన్స్ ఆడడానికి ప్రయత్నించగా, బాల్ ప్యాడ్లను తాకింది. వెంటనే బౌలర్ బుమ్రాతో పాటుగా కీపర్ కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి గట్టిగా అప్పీల్ చేయడంతో స్టీవ్ స్మిత్‌ను అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. దీంతో షాక్ అయిన స్మిత్ ఎల్బీడబ్ల్యూ పై రివ్యూ తీసుకోకుండా పెవిలియన్ చేరాడు.
నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న మరో ప్లేయర్ ట్రావిస్ హెడ్ కూడా రివ్యూ గురించి సూచన చేయకపోవడంతో స్మిత్ మైదానం వెలుపలి వచ్చాడు. కానీ ఆ తర్వాత రీప్లేలో బాల్ ఆఫ్ సైడ్ బయటకు వెళ్ళిన్నట్లు బంతి ట్రాకింగ్ సిస్టమ్ చూపించింది. అది చూసిన నెటిజన్లు స్మిత్ రివ్యూ తీసుకోకుండా ఎందుకు వెళ్లాడో అని కామెంట్స్ చేస్తున్నారు. కోహ్లి చాలా కాన్ఫిడెన్స్ గా అప్పీల్ చేయడం వల్లే స్మిత్ రివ్యూ తీసుకోలేదంటూ కొందరు నెటిజన్లు భావిస్తున్నారు.
Ads
It was not out, but Steven Smith didn't review. pic.twitter.com/pyKbs1BZ5i
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 19, 2023
Also Read: WORLD CUP2023: ఫైనల్ లో ఇండియా ఓడిపోవడానికి 4 ప్రధాన కారణాలు ఇవే…అదే ఆస్ట్రేలియాకి ప్లస్ అయ్యింది.!