Ads
నటుడిగా ఎన్నో సినిమాలు చేసి, నిర్మాతగా కూడా మారి, కొత్త టాలెంట్ ని పరిచయం చేస్తున్న నటుడు మాస్ మహారాజా రవితేజ. ఎన్నో సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయ్యారు వైవా హర్ష. ఇప్పుడు వైవా హర్ష హీరోగా, రవితేజ సహనిర్మాతగా వచ్చిన సినిమా సుందరం మాస్టర్. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం: సుందరం మాస్టర్
- నటీనటులు: హర్ష చెముడు, దివ్య శ్రీపాద, హర్షవర్ధన్.
- దర్శకుడు: కళ్యాణ్ సంతోష్
- సంగీతం: శ్రీ చరణ్ పాకాల
- నిర్మాత : రవితేజ, సుధీర్ కుమార్ కుర్ర
- రిలీజ్ డేట్ : ఫిబ్రవరి 23, 2024
కథ:
సుందరం (వైవా హర్ష) ఒక గవర్నమెంట్ టీచర్. కట్నం ఎక్కువగా తీసుకొచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడు. అయితే, ఆ ఊరి ఎమ్మెల్యే (హర్షవర్ధన్) సుందరాన్ని, మిరియాల మెట్ట అనే ఒక ఊరికి వెళ్లి ఇంగ్లీష్ పాఠాలు చెప్పమని, అలా చెప్తే తనకి డిఇఓ పోస్ట్ ఇస్తాను అని చెప్తాడు. దాంతో, ఒకవేళ తన పొజిషన్ పెరిగితే కట్నం కూడా ఎక్కువగా వస్తుంది అనే ఆశతో ఆ ఊరికి సుందరం వెళ్తాడు.
కానీ అక్కడ వాళ్లకి ముందే ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది. సుందరానికి ఇంగ్లీష్ రాదు అని అంటారు. అంతే కాకుండా, సుందరానికి పరీక్ష కూడా పెడతారు. అప్పుడు సుందరం ఏం చేశాడు? ఇంగ్లీష్ చెప్పడంతో పాటు ఎమ్మెల్యే ఇచ్చిన మరొక పని ఏంటి? దాన్ని సుందరం పూర్తి చేశాడా? ఆ ఊరిలో ఎలా నివసించాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
సినిమా కోసం దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. సాధారణంగా మనం సిటీ లైఫ్ కి అలవాటు పడిపోయి, అప్పుడప్పుడు ఎక్కడికైనా ప్రకృతికి దగ్గరగా ఉండే ప్రదేశాలకి వెళ్లి, కొన్ని రోజులు అక్కడ ఉండి రావాలి అని అనుకుంటూ ఉంటాం. స్వచ్ఛమైన మనుషులు, ప్రశాంతమైన వాతావరణం ఇవన్నీ చూస్తే హాయిగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి మిరియాల మెట్ట అనే ప్రదేశాన్ని ఈ సినిమాలో చూపించారు. సినిమాలో కామెడీ తో పాటు మంచి సందేశం కూడా ఉంది.
Ads
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, వైవా హర్ష ఈ సినిమాలో హీరోగా నటించారు. ఇప్పటి వరకు కేవలం కామెడీ పాత్రలోనే ఎక్కువగా చూసాం. కానీ ఈ సినిమాలో కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా నటించారు. దివ్య శ్రీపాద కూడా అనాధ పాత్రలో నటించారు. అమాయకంగా బాగా నటించారు. ఓజా అనే పాత్రలో నటించిన మరొక అబ్బాయి కూడా చాలా బాగా నటించారు. శ్రీ చరణ్ పాకాల అందించిన పాటలు డీసెంట్ గా ఉన్నాయి. దీపక్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.
టెక్నికల్ గా సినిమా మాత్రం చాలా హై క్వాలిటీలో ఉంది. ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి తోడ్పాటు అందించిన రవితేజని మెచ్చుకోవాల్సిందే. అయితే, సినిమా ట్రైలర్ చూసి సినిమాలో కామెడీ చాలా ఉంటుంది అని ఆశించి వెళ్తాం. కానీ సినిమా అలా ఉండదు. సినిమాలో కామెడీ అనేది కేవలం ఒక భాగం మాత్రమే.
అక్కడ మనుషులు ఎదుర్కొనే పరిస్థితుల వల్ల వచ్చే కొన్ని సంఘటనల్లో కామెడీ జనరేట్ అయ్యి నవ్వు తెప్పించే సీన్స్ ఉంటాయి. అంతే కానీ సినిమా మొత్తం కామెడీ మీద నడవదు. చాలా బలమైన కాన్సెప్ట్ ఉన్న సినిమా ఇది. సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల మాత్రం కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. కానీ మొత్తంగా చూసుకుంటే మాత్రం సింపుల్ గా సాగిపోతుంది. అలాగే మరొక వైపు ఒక మంచి సందేశం కూడా ఇస్తుంది.
ప్లస్ పాయింట్స్:
- స్టోరీ పాయింట్
- మెసేజ్
- నటీనటుల పర్ఫార్మెన్స్
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- సెకండ్ హాఫ్ లో ల్యాగ్
- లాజిక్ లేని కొన్ని సీన్స్
రేటింగ్:
3/5
ఫైనల్ గా:
మరీ ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, సరదాగా సాగిపోయే ఒక సినిమా చూద్దాం అనుకునే వారికి సుందరం మాస్టర్ సినిమా ఒక మంచి కామెడీ-ఎమోషనల్ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : వెనక్కి తిరిగి నిల్చున్న ఈ తెలుగు హీరో ఎవరో గుర్తు పట్టారా..? రజనీకాంత్ అనుకుంటే పొరపాటే..!