పూజ సమయంలో కొట్టిన‌ కొబ్బరికాయ కుళ్ళిపోతే.. ఏం అవుతుంది..?

Ads

చాలా మంది పూర్వం నుండి వచ్చే పద్ధతుల్ని ఇంకా పాటిస్తూ ఉన్నారు. ఇలా జరిగితే మంచిదని అలా జరిగితే మంచిది కాదని భావిస్తూ ఉంటారు. ఏదైనా తప్పు చేస్తే భయపడుతూ ఉంటారు భగవంతుడిని పూజించడంలో కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. సాధారణంగా భారతీయ సంప్రదాయల ప్రకారం ఎక్కువగా ప్రతి ఒక్కరూ దైవభక్తిని నమ్ముతూ ఉంటారు.

దైవానికి ఇచ్చినంత విలువ ఇంకో దానికి ఇవ్వరు అని చెప్పొచ్చు. అయితే సాధారణంగా ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కానీ లేదంటే ఆలయాలకి వెళ్లి పూజ చేయించుకున్నప్పుడు కానీ కొబ్బరికాయని కొడుతూ ఉంటాము. కొబ్బరికాయని కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మంచిదని శుభమని భావిస్తారు.

అదే ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే మంచి జరగదని అరిష్టమని భావిస్తూ ఉంటారు. కొబ్బరికాయని కొట్టినప్పుడు నీళ్లు లేకపోయినా కుళ్లిపోయినా కూడా ఏదో కీడు జరగబోతుందని కంగారు పడిపోతూ ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు .అయితే ఒకవేళ కనుక కొబ్బరికాయ కుళ్ళిపోతే దాని అర్థం ఏంటి.. ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

Ads

దేవాలయాల్లో కానీ ఇంట్లో కానీ కొబ్బరికాయని కొడితే ఆ కొబ్బరికాయ కుళ్ళి పోయిందంటే అది మనపై ఉండే దిష్టి కుళ్ళు అంతా పోయిందని అర్థం చేసుకోవాలి మనకి జరగబోయే కీడు తొలగిపోయింది అని అనుకోవాలి. అంతే కానీ మనకి ఏదో కీడు సంభవిస్తుంది అని ఇబ్బందుల్లో పడ్డామని అనుకోకూడదు. కొబ్బరికాయ ద్వారా కీడు అంతా తొలగిపోయిందని కీడు రూపంలో వెళ్లిపోయిందని అనుకోవాలి.

కొబ్బరికాయ కుళ్ళిపోతే కీడు జరుగుతుంది అనుకోవడం మానసిక బలహీనతగా భావించాలి తప్ప ఇంకో విధంగా ఎప్పుడూ కూడా అర్థం చేసుకోకూడదు. కొబ్బరికాయ కుళ్ళి పోయిందంటే కీడు అని శాస్త్రాల్లో ఏమి చెప్పలేదు ఒకవేళ కనుక కొబ్బరికాయ కొట్టినప్పుడు నీళ్లు లేకపోయినా అది కుళ్ళిపోయిన ఎటువంటి కీడు జరగదు ఇలా జరిగితే అస్సలు భయపడకండి చింతించకండి.

Previous articleరాజమౌళి అన్ని సినిమాల్లో… ఈ కామన్ పాయింట్ ని గమనించారా..?
Next articleవిక్టరీ వెంకటేష్, రాజమౌళి కాంబినేషన్ లో ఆగిపోయిన సినిమా ఇదే..!