విక్టరీ వెంకటేష్, రాజమౌళి కాంబినేషన్ లో ఆగిపోయిన సినిమా ఇదే..!

Ads

విక్టరీ వెంకటేష్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు వెంకటేష్ అందరికీ సుపరిచితమే. అప్పటినుండి ఇప్పటివరకు ఎన్నో చక్కటి సినిమాల్లో నటించారు వెంకటేష్. కొంతమంది హీరోలకి కొన్ని
జానర్ లో సినిమాలు మాత్రమే సూట్ అవుతూ ఉంటాయి కానీ వెంకటేష్ కి మాత్రం అలా కాదు వెంకటేష్ ఏ జోనర్ లో సినిమా చేసినా కూడా ఆ సినిమా మంచిగా సక్సెస్ అవుతుంది.

ఎటువంటి పాత్రకైనా సరే ఇట్టే సెట్ అయిపోతాడు వెంకటేష్. కామెడీ, సెంటిమెంట్, మాస్, ప్రేమ కథలు ఇలా ఏ స్టోరీ అయినా కూడా వెంకటేష్ కి బాగా సూట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా వెంకటేష్ ఆ పాత్రకి సెట్ కాలేదు అన్న ఫీలింగ్ మనలో కలగలేదు. 60 ఏళ్ల వయసు దాటినా కూడా ఆయన సినిమాలని ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటారు.

ఈ వయసులో కూడా 80 కోట్ల రూపాయలకే పైగా షేర్స్ ని కొట్టేస్తున్నారు వెంకటేష్. అయితే ఈ తరం టాప్ డైరెక్టర్లు వెంకటేష్ తో కలిసి పనిచేయట్లేదు గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా దర్శకత్వంలో ఒక సినిమా వస్తుందని అన్నారు. అయితే ఇంకా ఆ సినిమా గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. ఆ ప్రాజెక్టు ఊసే లేకపోయింది.

Ads

వెంకటేష్ డ్రీమ్ ప్రాజెక్ట్ స్వామి వివేకానంద బయోపిక్ అని చాలా సందర్భాల్లో అన్నారు. ఈ ప్రాజెక్టు ఎప్పుడు చేసిన కూడా భారీగానే చేయాలని అనుకున్నారు వెంకటేష్. ఈ ప్రాజెక్ట్ ని రాజమౌళి తో చేయమని వెంకటేష్ మగధీర సినిమా టైం లో అడిగారు. అయితే రాజమౌళి చేద్దామని చెప్పినా కూడా ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎటువంటి వివరాలు బయటకు రాలేదు.

కనీసం ప్రాజెక్టు గురించి ఆలోచించలేదని తెలుస్తోంది. రాజమౌళి మిగిలిన ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టలేదు. రాజమౌళి బాహుబలి సినిమాని తీయడం తర్వాత ఆర్ ఆర్ ఆర్ ఇప్పుడేమో మహేష్ బాబు తో ఇప్పుడు ఒక సినిమా చేయడం తో వెంకటేష్ తో సినిమా గురించి ఇంకా ఆలోచించడం లేదేమో.. ఇప్పటిదాకా వెంకటేష్ అయితే 85 సినిమాల్లో నటించారు వెంకటేష్ 100వ సినిమా గా స్వామి వివేకానంద బయోపిక్ రాబోతోంది. త్వరలో శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ అనే సినిమా రాబోతోంది.

Previous articleపూజ సమయంలో కొట్టిన‌ కొబ్బరికాయ కుళ్ళిపోతే.. ఏం అవుతుంది..?
Next articleసుప్రీం కోర్టు: ప్రేమ వివాహాలలోనే విడాకులు ఎక్కువ…!