Ads
ఇటీవలే భారత్ చంద్రయాన్ 2 విజయోత్సాహంలో ఉంది. ఈ క్రమంలో అంతరిక్షంలో ప్రయోగాలను మరింత ముమ్మరం చేయనుంది. మరో వైపు నాసా కూడా చంద్రుడిపైకి, అంగారక గ్రహం పైకి వ్యోమగాములను పంపించాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ఈ విషయంలో చాలా మందికి కొన్ని సందేహాలు ఉంటాయి. ఒకవేళ వ్యోమగాములు అంతరిక్షం లోకి వెళ్ళాక మరణిస్తే, వారి మృతదేహాలను ఏమి చేస్తారు. నిజానికి అంతరిక్షంలోకి మనుషులను పంపడం చాలా కష్టమైన ప్రక్రియ. ఎన్నో జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అక్కడకి వెళ్లిన వ్యక్తులకు మరణం ఎదురైతే? తరువాత పరిస్థితి ఏంటన్నది చాలా మందికి తెలియని అంశం.
ఒకవేళ వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్ళాక మరణిస్తే.. అతడిని ఖననం చేయడం లేదా దహనం చేయడం అనేది అసాధ్యమైన విషయం. వారిని అలానే వదిలేస్తే.. ఆ మృతదేహం ద్వారా సూక్ష్మక్రిములు పుట్టుకొచ్చి అక్కడి నేలని, వాతావరణాన్ని కలుషితం చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి గతంలో నాసాకు ఎదురైంది. గత అరవై ఇళ్లల్లో 20 మంది వ్యోమగాములు అంతరిక్షంలో మరణించారు. 1986 నుంచి 2003 మధ్యలో నాసా ప్రయోగాలలో 14 మంది మరణించారు.
Ads
అసలు అంతరిక్షంలోకి పంపేముందు వ్యోమగాములు పూర్తి ఆరోగ్యంతో ఉండాలి, వారి ఆరోగ్యం గురించి నాసాకు చెందిన ‘ద ట్రాన్స్‌లేషనల్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ హెల్త్ కేర్ తీసుకుంటుంది. అంతరిక్షయానం చేస్తున్నపుడు మధ్యలో లేదా ‘లో ఎర్త్ ఆర్బిట్’లో చనిపోతే అతని శరీరాన్ని వెంటనే భూమి మీదకు తీసుకొస్తారు. కానీ, చంద్రుడిపైకి వెళ్ళాక చనిపోతే, భూమి మీదకు రావడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. అప్పటిదాకా ఆ మృతదేహాన్ని ప్రత్యేకమైన బాడీ బ్యాగ్‌లో కానీ, ప్రత్యేక చాంబర్ లో కానీ మిగతా వ్యోమగాములు భద్రపరుస్తారు.
మృతదేహాన్ని వేగంగా భూమి వద్దకు తీసుకురావడం కంటే బ్రతికి ఉన్న ఇతర వ్యోమగాములు సురక్షితంగా భూమి మీదకు చేర్చడాన్ని నాసా మొదటి ప్రాధాన్యత అంశంగా పరిగణిస్తుంది. అంగారక గ్రహం , మార్స్, చంద్రుడి పైనా ఒక్కోచోట ఒక్కోలా వాతావరణం ఉంటుంది. అక్కడి పరిస్థితులలో దహన సంస్కారాలు చేయడం సాధ్యం కాదు. అందుకే మృతదేహాన్ని ప్రత్యేకమైన బాగ్ లో భద్రపరిచి భూమి మీదకు తీసుకువస్తారు.