Ads
చాలా మంది ఐఫోన్లు ని ఇష్ట పడుతూ ఉంటారు మీరు కూడా ఐఫోన్ ని ఇష్టపడుతూ ఉంటారా..? నిజానికి చాలా మందికి ఐఫోన్స్ అంటే ఎంతో ఇష్టం. కొత్త ఐఫోన్ ఏది వస్తే దానిని కొనుగోలు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. ఐఫోన్ కి ఉన్నా డిమాండ్ అంతా కాదు. పైగా ఐఫోన్ ని కొనుగోలు చేయడానికి డబ్బులు దాచుకునే వాళ్ళు కూడా ఉన్నారు.
ఎన్ని మొబైల్ ఫోన్స్ వచ్చినా సరే ఐఫోన్ కి ఉన్న స్పెషాలిటీ వేరే లెవెల్ లో ఉంటుంది. స్మార్ట్ ఫోన్ కి మించి దీని లుక్ ఉంటుంది పైగా దీన్ని స్టైల్ కూడా మరొక లెవెల్ లో ఉంటుంది.
Ads
అయితే ఎప్పుడైనా ఐఫోన్ ముందు ”ఐ” అని ఎందుకు ఉంటుంది..? అనే సందేహం మీకు వచ్చిందా..? ఐ అంటే అసలు ఏమిటి అనే విషయం గురించి ఇప్పుడు చూద్దాం. ఐఫోన్, ఐమాక్ ఇలా ఐ అని ఉంటుంది. ప్రపంచానికి మొదటి కంప్యూటర్ ని 1998 వ సంవత్సరంలో ‘ఐమాక్’ తో వచ్చింది. అందరికి కంఫర్ట్ గా ఉండేలా దీన్ని రూపొందించారు. ఇంటర్నెట్ చేరేలా సౌకర్యవంతంగా వుండేటట్టు తీసుకు వచ్చారని ఆపిల్ చీఫ్ ఎక్సిక్యూటివ్ స్టీవ్ జాబ్స్ అన్నారు.
ఇక ఐ కి అర్ధం చూస్తే.. ఇంటర్నెట్, ఇండివిడ్యుల్, ఇన్ సృక్ట్, ఇన్ఫర్మ్, ఇన్ స్పైర్ అని.. ఈ విషయాన్ని లాంచింగ్ సమయంలో మిస్టర్ జాబ్స్ చెప్పారు. ఒక పర్సనల్ కంప్యూటర్ సంస్థ అయినా సరే విద్య విధానం కోసం లక్ష్యంగా చేసుకుని దీన్ని తయారు చేశామని అన్నారు. ఇది టీచింగ్ వంటి వాటికి కూడా బాగా ఉపయోగ పడుతుంది. ఐ అంటే ఈయన చెప్పినట్టు ముఖ్యంగా ఇంటర్నెట్ ,ఇండివిడ్యుల్ అని అర్ధం. ఆపిల్ రిలీజ్ చేసిన ఐవాచ్, ఐపాడ్, ఐమాక్ ఇవి అన్నీ కుడా ఐ తో స్టార్ట్ అవుతాయి.