Ads
హిందూ సంప్రదాయం ప్రకారం శుభకార్యాలలో అనేక ఆచారాలు పాటిస్తూ ఉంటారు. ఎప్పటి నుండో వస్తున్న ఈ సంప్రదాయాల పట్ల ఇప్పటికి కూడా ప్రజలు గౌరవంతో పాటిస్తున్నారు. అనాదిగా వస్తున్న సంప్రదాయాల్లో ఒడి బియ్య కూడా ఒకటి.
సాధారణంగా వివాహం అయిన తరువాత వధువు పుట్టింటి వారు తమ కుమార్తెలకు ఒడిబియ్యం పోయడం అనేది ఆచారంగా వస్తోంది. పెళ్లి అయిన కూతురిని ప్రతీ సంవత్సరం ఇంటికి పిలిచి పుట్టింటి వారి స్థోమతకి తగిన విధంగా కొత్త బట్టలు పెట్టి, ఒడిబియ్యం పోస్తుంటారు. ఇలా పెళ్లి అయిన ఆడపిల్లలకు వారి తల్లిదండ్రులు ఒడిబియ్యం పోయడం వెనుక ఉన్న కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఈ ఒడి బియ్యం అనే ఆచారం గురించి పండితులు ఏం చెబుతున్నారంటే, సాధారణంగా మనిషి శరీరంలో 72 వేల నాడులు వుంటాయి. ఈ నాడులు కలిసే ప్రతి చోట కూడా ఒక చక్రం వుంటుంది. ఇలాంటివి చక్రాలు మనిషి శరీరంలో 7 వుంటాయి. అయితే ఈ ఏడు చక్రాలలో గౌరీదేవి 7 రూపాలలో ఉంటుంది. వీటిలో మణిపూర చక్రం అనేది నాభి దగ్గర వుంటుంది. ఈ చక్రం మధ్యలో ఒడ్డియాన పీఠం అనేది వుంటుంది. ఈ పీఠంలో ఉండే శక్తి రూపాన్ని మహాలక్ష్మీగా విశ్వసిస్తారు.పెళ్లి అయిన అమ్మయిలకు ఒడి బియ్యం పోయడం అంటే ఒడ్డియాన పీఠంలో ఉన్న మహాలక్ష్మీకి ఆ బియ్యాన్ని సమర్పించడమే. పుట్టింటి వారు ఆడపిల్లలను తమ గృహానికి మహాలక్ష్మీగా భావించి పెళ్లి అయిన తరువాత ఒడిబియ్యం పోస్తుంటారు. ఒడిబియ్యం పోసేటపుడు కుమార్తెను మహాలక్ష్మీగా, ఆమె భర్తని శ్రీ మహా విష్ణువుగా భావిస్తారు. తల్లి ఒడి అనగా ఒక రక్షణ నిలయం. ఇక మహాలక్ష్మీగా అనుకునే అమ్మాయిలు తమ కుటుంబ సభ్యులకు, పిల్లలకు రక్షణగా ఉంటారు.
Ads
పుట్టింటివారు తమ కూతురికి ఒడిబియ్యం పోసేటపుడు బియ్యం ఒకటే కాకుండా అష్ట ఐశ్వర్యాలను పోస్తారు. అనగా తమ కుమార్తె అష్ట ఐశ్వర్యాలతో జీవితాంతం తులతూగాలని వారు ఆశిస్తారు. ఆ ఆనందంతో కుమార్తె తన పుట్టిల్లు కూడా అష్ట ఐశ్వర్యాలతో విలసిల్లాలని తనకు పోసిన ఒడిబియ్యంలో నుండి 5 పిడికిల్ల బియ్యంను పుట్టింటికి వారికి ఇచ్చి, ఆ ఇంటి ముఖ్య ద్వారానికి పసుపు, కుంకుమలు పెట్టి, అత్తవారింటికి వెళ్తుంది.
Also Read: పారిజాత పుష్పాలను పొరపాటున కూడా వేరేవారి దగ్గర నుండి తీసుకోని పూజ చేయకూడదు.. ఎందుకో తెలుసా?