రోడ్డు మీద డబ్బులు దొరికితే ఏం చెయ్యాలి.. మన వెంట తీసుకు వెళ్లవచ్చా..?

Ads

ఊరికే డబ్బులు కనపడితే తీసుకోవడం మంచిది కాదని పెద్దలు అంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉన్నత స్థితికి చేరుకోవాలని ఉంటుంది. ఒక్కొక్క సారి ఎవరివైనా రోడ్డు మీద డబ్బులు పడిపోయి కనబడుతూ ఉంటాయి. లేకపోతే డబ్బులు ఉన్న బ్యాగ్ ని మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవేళ కనుక అవి మనకి కనపడితే మనం ఏం చేయాలి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

కొంత మంది డబ్బులు ఫ్రీగా వచ్చాయి కదా అని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలా చేయడం తప్పా..? ఫ్రీగా డబ్బులు కనపడితే ఏం చేయాలి..? ఒకవేళ అక్కడ ఎవరూ లేకపోతే ఆ డబ్బులు మనం మన వెంట తీసుకు వెళ్ళొచ్చా ఇక దీని గురించి చూసేద్దాం.

Ads

ఒకవేళ కనుక డబ్బులు లేదా డబ్బులు సంచి, బంగారం వంటివి కనపడితే పారేసుకున్న వ్యక్తి అక్కడ ఉంటే వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. ఒకవేళ అలా కాదు వాళ్ళు లేరు అంటే ఆ డబ్బుని దానం చేయడానికి కానీ దేవాలయాల్లో వేయడం కానీ మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం మరో ఇంటరెస్టింగ్ విషయాన్ని పండితులు చెప్పారు. వాస్తు ప్రకారం ఏదైనా నాణెము కానీ డబ్బులు కానీ కనబడితే వాటిని మన వెంట తీసుకు వెళ్ళచ్చు. ఇలా దొరికిన వాటిని తీసుకువెళ్లడం శుభ ఫలితంగా భావించాలి. మీ దగ్గర దానిని ఉంచితే కొన్ని శుభవార్తలు త్వరలో మీరు వినబోతున్నారు అని దానికి అర్థం.

అలానే ఆర్థిక ప్రయోజనాలను కూడా మీరు పొందబోతున్నారని దానికి అర్థం. కనుక ఒకవేళ కనుక ఎవరైనా పారేసుకున్న డబ్బులు మీకు దొరికితే వాటిని వెంట తీసుకువెళ్లడం మంచిదే. దీనితో మీరు త్వరలో విజయం సాధిస్తారు కాబట్టి దొరికిన డబ్బుని తీసుకువెళ్లడంలో తప్పు లేదని పండితులు చెప్తున్నారు. పైగా ఇలా డబ్బులు దొరకడం అదృష్టానికి సంకేతంగా భావించాలి. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా రోడ్డు మీద డబ్బులు పారేసుకుని.. అవి మీకు దొరికితే మీరు ఈ విధంగా ఆచరించొచ్చు.

Previous articleషారుఖాన్ నుంచి సమంత వరకు మన స్టార్స్ మొదటి సంపాదన ఎంత ? అప్పట్లో ఏ ఉద్యోగులు చేసారు ?
Next articleజానీ సినిమా ప్లాప్, వరల్డ్ కప్ మిస్, పెప్సీ డ్రింక్ ఫెయిల్… పవన్ కళ్యాణ్ కి దెబ్బ మీద దెబ్బ..!