ఈ రకంగా దొరికిన డబ్బును ఏం చేయాలో మీకు తెలుసా?

Ads

మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు అనుకోకుండా మనకు దారిలో నాణెలు లేక డబ్బు కాగితాలు దొరుకుతుంటాయి. ఆ డబ్బు తీసుకోవచ్చా? తీసుకుంటే దాన్ని ఏం చేయాలి? అనేది మనలో చాలామందికి అర్థం కాని ప్రశ్న. కొంతమంది దొరికిన డబ్బు మాదే అని ధీమాగా వాటిని జేబులో వేసుకొని హాయిగా వెళ్ళిపోతారు. మరి కొంతమంది ఆ డబ్బును తీసుకువెళ్లి ఏదన్నా హుండీలో లేక ఎవరైనా దగ్గరలో బిక్షం ఎత్తుతుంటే వారికి వేస్తుంటారు. అయితే ఆ డబ్బుతో చేయాల్సిన సరియైన పద్ధతి ఏమిటి అనేది ఎవరికీ తెలియదు.

మనకు దొరికిన డబ్బు మనది కాదు ఇతరులది.. ఇతరుల సొమ్ము తీసుకోవడం పాపంతో సమానమని అందరూ భావిస్తుంటారు కాబట్టి ఇలా దొరికిన డబ్బును ఏం చేయాలి అని చాలామంది అర్థం కాక ఇబ్బంది పడుతుంటారు. అలా దొరికిన డబ్బులు దాచి పెట్టుకోవడం మంచిదా? వాటిని మన సొంత ఖర్చులకు వాడవచ్చా? లేకపోతే వాటితో ఏమి చేయాలి ?అనే అనుమానం మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక క్షణంలో కలిగే ఉంటుంది.మరి అలా దొరికిన నాణ్యాలు లేక నోట్లను ఏం చేయాలో తెలుసుకుందామా..

Money Found on Road రోడ్డుపై డబ్బులు ...

Ads

అయితే మన వాస్తు శాస్త్రం ప్రకారం రోడ్డుమీద దొరికే నాణ్యాలు శుభప్రదం గా పరిగణిస్తారు. చైనాలో కూడా ఇలా దొరికిన డబ్బును లావాదేవీల రూపంగానే కాకుండా అదృష్టంగా కూడా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఏదైనా పనిమీద బయటకు వెళ్ళినప్పుడు దారిలో ఇలా డబ్బు దొరికితే అది మన విజయానికి చిహ్నం అని అర్థం.

 ఏదైనా పని పూర్తి చేసుకుని.. తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఒకవేళ దారిలో రోడ్డు మీద డబ్బు దొరికితే.. అది శుభ ఫలితాన్ని సూచిస్తుంది అంటున్నారు. దీని కారణంగా అలా దొరికిన వారు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారనడానికి సంకేతం. లేదా కొన్ని శుభవార్తలు అందుకోవచ్చనడానికి సంకేతమట.

అదే ఇంటికి తిరిగి వచ్చే సమయంలో దొరికితే అది ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి అనేదానికి చిహ్నంగా పరిగణిస్తారు.మీకు వీధిలో వెళ్లేటప్పుడు ఎక్కడైనా ఇలా డబ్బులు దొరికితే వాటిని దేవుడు హుండీలో అన్నా వేయవచ్చు లేదా మీ పర్సులో పెట్టుకోవచ్చు. మరి ముఖ్యంగా ఇలా దొరికిన డబ్బులు నిజంగా అవసరంలో ఉన్న వారికి సహాయంగా అందిస్తే మనకు ఎంతో పుణ్యం లభిస్తుంది.

 

Previous articleమనీ ప్లాంట్ పెంచుతున్నారా ..అయితే కచ్చితంగా మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే..
Next articleవిడిపోవడానికి ముందే ఎన్నో కాంట్రవర్సీల నడుమ చికిన్న సమంత, సిద్ధార్థ జంట