Ads
ప్రస్తుతం నగర ప్రజల దృష్టి కుక్కల పైనే ఉంది. ఇటీవల నాలుగు సంవత్సరాలు కలిగిన బాలుడు వీధి కుక్కలకు బలి అయినప్పటి నుండి ప్రజలు కుక్కలపై కోపం వ్యక్తం చేస్తున్నారు. అయితే కుక్కలను సమర్ధించే వారు కూడా ఉన్నారు.
Ads
చనిపోయిన బాబు కంటే దృష్టి కుక్కలపై ఉండడం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది. ఒకరు కుక్కలకు పునరావాసం కల్పించాలని, మరొకరు ప్రజలు ముందుకు వచ్చి వీటిని దత్తత తీసుకోవాలని అంటున్నారు. ఇక అంబర్ పేట్ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుండి నాటి జనం కుక్కలను చూస్తూనే భయపడుతున్నారు. వాటిని చూస్తేనే పరుగులు పెడుతున్నారు. అయితే హఠాత్తుగా పది కుక్కలు వెంటపడినపుడు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
పరుగులు పెట్టడం, పారిపోవడం చేయవద్దు..
కుక్క లేదా కుక్కలు కనిపించగానే పరుగెత్తడం, పారిపోవడం లాంటివి చేయకూడదు. వాటిని చూసి ఎప్పుడైతే పరుగు పెడతారో అప్పుడు కుక్కలు మీకంటే అవే బలమైనవి అనుకొని వెంటపడి, దాడి చేస్తాయి. అందువల్ల అవి కనిపించగానే రన్ చేయకూడదు. కుక్కలు మీ వైపు అదోరకంగా చూస్తే, పరుగెత్తకుండా మామూలుగా నడవండి. కుక్క ఏదైనా అరుస్తూ వస్తే కదలకుండా నిలబడండి. అప్పుడు అవి కాసేపటి తర్వాత వెళ్లిపోతాయి.
గుర్రుగా చూడటం ప్రమాదం..
నడుస్తున్నప్పుడు సడెన్ గా కుక్కల గుంపు వస్తే అప్పుడు ఏం చేయాలి అనేది కొంతమందికి అర్థం కాదు. అప్పుడు కుక్కల వైపు అలాగే చూస్తూ ఉంటారు.అసలు అలా చేయకూడదు. వాటి కళ్లలోకి అలా సూటిగా చూడవద్దు. మీముందు ఎన్ని కుక్కలు ఉన్నా, వాటిని పట్టించుకోనట్లుగా ఉండాలి. అలా కాకుండా వాటి కళ్లలోకి చూశారో, అప్పుడు కుక్కలు రెచ్చ గొట్టినట్లుగా అనుకుని వెంటనే దాడి చేస్తాయి. అందువల్ల వాటిని పట్టించుకోనట్టుగా ఉండడం మంచిది.
ప్రతిఘటించడం..
కుక్క లేదా కుక్కల గుంపు అరుస్తూ ఉంటే పరుగులు పెట్టడం లేదా వాటిమీద రాళ్లు విసరడం లాంటివి చేస్తుంటారు. ఈ రెండు ప్రమాదకరమే. రాయి విసిరి అలానే నిలబడి ఉంటే అవి రెచ్చిపోయి, అన్ని దాడి చేస్తాయి. ఇలాంటి టైమ్ లో కర్రను చేతిలో పట్టుకోవాలి. ఎలాంటి ఆయుధం చేతిలో లేనపుడు వేసుకున్న బ్యాగులైనా, చెప్పులైనా ఏదైనా ఆయుధంగా మార్చుకోవాలి. కుక్కల పైకి విసురుతున్నట్లుగా అలాగే నిలబడి ఉండాలి. అప్పుడు కుక్కలు దగ్గరగా రాకుండా ఉంటాయి.విచిత్ర వేషధారణలు..
కుక్కలకు మనం వేసుకునే కలర్స్ కొన్నిసార్లు నచ్చవు. అప్పుడు అవి ఆ రంగులను చూసి అరుస్తూ ఉంటాయి. అర్దం అయ్యేలా చెప్పాలంటే మంచి రంగు డ్రెస్ వేసుకొని, నల్లపు రంగు కళ్లద్దాలు పెట్టుకుని, ఎరుపు రంగులో ఉండే టోపీ పెట్టుకున్నట్లయితే, అది కుక్కలు వింతగా ఫిల్ అయ్యి, వెంటపడుతాయంట. కాబట్టి కుక్కలు కనిపించినా/ వెంటపడినా వెటనే పెట్టుకున్న టోపీ, కళ్లద్దాలు తొలగించాలి. అప్పుడు అవి అక్కడే ఆగిపోతాయి.
Also Read: పాము కాటేసినా ముంగిసకు ఏమి కాకపోవడానికి కారణం ఏమిటో తెలుసా?