Ads
గతవారం మూడు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో ఒకటి విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా. ఇంకొకటి, ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గం గం గణేశా సినిమా. ఇంకొక సినిమా కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన భజే వాయువేగం సినిమా. మూడు డిఫరెంట్ జానర్స్ లో రూపొందాయి. మూడు సినిమాల్లో కొన్ని బాగుంటే, కొన్ని విషయాలు బాగాలేదు అంటు కామెంట్స్ వస్తున్నాయి. కానీ మూడు సినిమాల్లో ఒక సినిమాకి మాత్రం పాజిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. అసలు అంచనాలు లేకుండా విడుదల అయిన సినిమా ఇది.
బుక్ మై షో లో కూడా ఈ సినిమాకి ముందు తక్కువ ఇంట్రెస్ట్ లు ఉన్నాయి. కానీ ఒక్కసారి రివ్యూలు వచ్చాక ఈ సినిమాకి టికెట్స్ బుక్ చేసుకునే శాతం దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. ఈ సినిమా కార్తికేయ నటించిన భజే వాయువేగం సినిమా. మిగిలిన రెండు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకి ముందుగా టాక్ తక్కువగా ఉంది. మూడు సినిమాలు ఒకటే రోజు విడుదల అవ్వడంతో, ఈ సినిమాకి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. కానీ టాక్ వచ్చాక ఈ సినిమాకి వెళ్లే జనాల సంఖ్య పెరిగింది. సినిమాలో ఫస్ట్ హాఫ్ మామూలుగా నడుస్తుంది.
Ads
కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత పరిశీలించి చూస్తే అసలు కథ మొత్తం ఇందులోనే ఉన్నట్టు అనిపిస్తుంది. మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాని అంతే బాగా హ్యాండిల్ చేశారు. రైటింగ్ పరంగా చూసుకున్నా కూడా సెకండ్ హాఫ్ చాలా బలంగా ఉంటుంది. చాలా సినిమాల్లో ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ కి వచ్చే సమయానికి ఎటో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కానీ సినిమాలో అలా కాకుండా సెకండ్ హాఫ్ లోనే చాలా బాగా రాసుకున్నారు. మొదటి 20 నిమిషాలు చాలా స్లోగా నడుస్తాయి.
అంటే సినిమాలో పాత్రలని పరిచయం చేయడానికి సమయం తీసుకున్నారు. కానీ ఒక్కసారి సినిమా అసలు ట్రాక్ లోకి పడిన తర్వాత అలా వెళ్ళిపోతుంది. ఎక్కడ సాగదీసినట్టు అనిపించదు. స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారు. దాంతో ఈ సినిమా టాక్ కూడా బాగా వస్తోంది. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా బాగుంది అని కామెంట్స్ చేస్తున్నారు. అందుకే సినిమాకి ఇంకా ఎక్కువ మంది జనాలు వెళ్తున్నారు.