అమలా పాల్ లాగే…రెండు పెళ్లిళ్లు చేసుకున్న 11 మంది సినీ సెలబ్రిటీలు వీరే.!

Ads

సినీతారలు సినిమాల్లో నటిస్తూ పాపులారిటీని కూడా సంపాదించుకుంటారు. సినిమాల్లో ఉన్నట్లే వల్ల జీవితాల్లో కూడా అనుబంధాలు,ప్రేమతో తమ కుటుంబాలను చూసుకుంటున్నారు. అయితే వీరిలో కొందరు నటీనటులు వారి జీవితాలను క్రమశిక్షణతో ఉన్నారు.

ఇంకొందరు స్టార్ స్టేటస్ తో వచ్చిన డబ్బుతో జీవితాలను పోగొట్టుకున్నవారు ఉన్నారు. మరికొందరు చిత్రాల్లో ఇద్దరు హీరోయిన్స్ తో రోమాన్స్ చేసినట్టుగా, నిజ జీవితంలోనూ రెండు, మూడు వివాహాలు చేసుకున్నారు. ఇక అలా పెళ్ళిళ్ళు చేసుకున్న స్టార్స్ ఎవరో చూద్దాం..
1.ఎన్టీఆర్:

టాలీవుడ్ మొదటి తరం స్టార్ హీరో నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ మేనమామ కూతురు బసవతారకాన్ని 1942లో పెళ్లి చేసుకున్నారు. ఆమె క్యాన్సర్‌తో చనిపోవడంతో ఒంటరిగా ఉన్న ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని 1993లో రెండో వివాహం చేసుకున్నారు.

2.సూపర్ స్టార్ కృష్ణ:

టాలీవుడ్ లో జేమ్స్‌బాండ్, కౌబాయ్ మూవీస్ తో సెన్సేషన్ సృష్టించిన కృష్ణ రెండు వివాహాలు చేసుకున్నారు. సినిమాల్లోకి రాక ముందు మేనమామ కూతురు 1961లో ఇందిరాదేవిని పెళ్లి చేసుకున్న కృష్ణ, 1969లో నటి విజయనిర్మలను ప్రేమించి వివాహం చేసుకున్నారు.

3. నాగార్జున:

కింగ్ నాగార్జున ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు కూతురు లక్ష్మీని 1984లో పెళ్లి చేసుకుని, మనస్పర్థలతో విడిపోయారు. తరువాత నటి అమలను ప్రేమించి, పెద్దల అనుమతితో 1992లో రెండో పెళ్లి చేసుకున్నారు.

4.నందమూరి హరికృష్ణ:

హరికృష్ణ కూడా తండ్రి ఎన్టీఆర్‌ బాటలోనే నడిచి రెండు పెళ్లిళ్ల చేసుకున్నాడు. లక్ష్మీని 1973లో పెళ్లి చేసుకున్నారు. వీరికి జానకీరామ్, కల్యాణ్ రామ్, సుహసినిలు సంతానం. తరువాత హరికృష్ణ షాలినిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి కుమారుడే జూనియర్ ఎన్టీఆర్.

5.పవన్ కల్యాణ్:

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పరిచయమైన పవన్ కల్యాణ్ తక్కువ టైమ్ లోనే తెలుగులో అగ్రకథానాయకుడిగా మారారు. నందినిని 1997లో పెళ్లి చేసుకున్న పవన్, తరువాత విడిపోయారు. ఆ తరువాత నటి రేణు దేశాయ్‌ ని ప్రేమించి, లాంగ్ డేటింగ్ తరువాత ఆమెను 2009లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం పరస్పర అంగీకారంతో విడిపోయారు.ఇక ఆ తరువాత రష్యన్ నటి అన్నా లెజ్‌నోవాను మూడో పెళ్లి చేసుకున్నారు.

Ads

6. మంచు మనోజ్:

మంచు మనోజ్ 2015 లో ప్రణతి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత పర్సనల్ కారణాల వల్ల వారిద్దరు విడిపోయారు. ఇటీవలే అలేఖ్యరెడ్డిని రెండో వివాహాం చేసుకున్నారు మనోజ్.

7.కమల్ హాసన్:

ఇండియా గర్వించదగ్గ గొప్ప హీరోల్లో ఒకరైన కమల్ హాసన్ కూడా 1978లో వాణి గణపతిని వివాహం చేసుకున్నారు. తరువాత విడిపోయిన కమల్ సారికను 1988లో రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక వారు మనస్పర్థలతో విడిపోయారు. తరువాత నటి గౌతమితో పదమూడేళ్ళు సహజీవనం చేసిన కమల్ ఆమెతోను విడిపోయారు.
8.రాధిక శరత్ కుమార్:

ప్రముఖ నటి రాధిక ప్రతాప్ పోతన్‌ను 1985లో వివాహం చేసుకున్నారు. తర్వాత ఆయనతో విడిపోయి, లండన్‌ వాసి అయిన రిచర్డ్ హ్యార్లీని రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ కొంతకాలానికే విడిపోయి, హీరో శరత్ కుమార్‌ ను ప్రేమించి 2001లో వివాహం చేసుకున్నారు.

9.ప్రకాశ్ రాజ్:

విలక్షణ నటుడుగా పేరు గాంచిన నటుడు ప్రకాశ్ రాజ్. ఈయన మొదట లలితా కుమారిని వివాహం చేసుకుని, 15 ఏళ్ల తరువాత 2009లో ఈ జంట విడిపోయింది. ఇక 2010లో కొరియోగ్రాఫర్ సోనీ వర్మని వివాహం చేసుకున్నాడు.

#10.దిల్ రాజు

ప్రముఖ ప్రొడ్యూసర్ “దిల్ రాజు”..తన మొదటి భార్య అనిత మరణించడంతో.. తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్నారు.

#11. అమలా పాల్

అమలా పాల్ ఇటీవల నటుడు జగత్ దేశాయ్‌ ని రెండో పెళ్లి చేసుకుంది. గతంలో ఏఎల్ విజయ్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు అమలా పాల్. పెళ్లయిన కొన్నాళ్లకే విభేదాలు తలెత్తడంతో వీరు విడిపోయారు.

Also Read: పూరి జగన్నాథ్ తొలి సినిమా ‘బద్రి’ గురించి ఆసక్తికర విషయాలు..

Previous articleఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో చెప్పగలరా..?
Next articleగతవారం విడుదలైన 3 సినిమాల్లో… గెలిచిన సినిమా ఏదంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.