Ads
ఖలిస్తానీ టె-ర్ర-రి-స్ట్ తో భారత్, కెనడా దేశాల మధ్య ఏర్పడిన విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నిజ్జర్ మ-ర్డ-ర్ వెనుక ఇండియా ప్రమేయం ఉండొచ్చని కెనడా పీఎం జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడంతో ఈ విబేధాలు తలెత్తాయి.
Ads
కెనడాలో ఉన్న భారత రాయబార కార్యాలయం నుండి చీఫ్ పవన్ కుమార్ రాయ్‌ను విదేశాంగశాఖ కెనడా నుంచి బహిష్కరించింది. దీంతో రెండు దేశాల మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో పవన్ కుమార్ రాయ్ ఎవరు? అని చర్చించుకుంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
కెనడా పవన్ కుమార్ రాయ్‌ను బహిష్కరించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలోనే కెనడా దేశ దౌత్య అధికారిని కూడా భారత్ బహిష్కరించింది. పవన్ కుమార్ రాయ్ కెనడాలో రా (భారత గూఢచార సంస్థ) కు చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఖలిస్థానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ మ-ర్డ-ర్ వెనుక పవన్ కుమార్ రాయ్ హస్తం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఈ క్రమంలోనే పవన్ కుమార్ రాయ్‌ను కెనడా విదేశాంగశాఖ బహిష్కరించింది.
పవన్ కుమార్ రాయ్ పంజాబ్ కేడర్‌కు చెందిన 1997 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. పంజాబ్‌లో తార్న్ తరణ్ జిల్లాలో విధులు నిర్వర్తించారు. సీఐడీ ఎస్పీగా అమృత్‌సర్‌లో పనిచేశారు. 2008లో జలంధర్‌లో సీనియర్ ఎస్పీగా పదోన్నతి పొందారు. పంజాబ్‌లోని ఖలిస్తానీ తిరుగుబాటు గురించి రాయ్‌కి సుపరిచితమే. 2010 నుండి సెంట్రల్ డిప్యూటేషన్ పై ఉన్నారు. రాయ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఆ తరువాత కెనడాలో ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్‌గా సెలెక్ట్ అయ్యారు. కెనడాలో భారత్ ఇంటెలిజన్స్ చీఫ్‌గా పవన్ కుమార్ రాయ్ పనిచేస్తున్నారు.
ఈ విబేధాల నేపథ్యంలో ఇరుదేశాలు పలు ఆంక్షలు విధించాయి. కెనడాలో ఉన్న ఇండియన్స్ జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చిరించింది. ప్రయాణాలు చేయడం పై ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. అది మాత్రమే కాకుండా తదుపరి నోటీసులు ఇచ్చే దాకా కెనడాకు వీసా జారీని నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.