37 ఏళ్లుగా ఆయనే ఎమ్మెల్యే…ఆయన్ని ఓడించి చరిత్ర సృష్టించిన 26 ఏళ్ల యశస్విని రెడ్డి ఎవరంటే ?

Ads

ఆయన రాజకీయ చరిత్ర ఘనమైన చరిత్ర. 37 సంవత్సరాల ఓటమి ఎరుగని రాజకీయ జీవితం అతనిది. అలాంటి రాజకీయ దిగ్గజాన్ని ఓడించటానికి ఎంతో అనుభవం కావాలి. కానీ 26 సంవత్సరాల ఒక మహిళ ఈ రాజకీయ దిగ్గజాన్ని ఎన్నికలలో ఓడించి చరిత్ర సృష్టించింది. ఇంతకీ ఆ రాజకీయ నాయకుడు ఎవరంటే 37 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగని రాజకీయ ధీరుడు ఎర్రబెల్లి దయాకర్ రావు.

1985 నుంచి ఎన్నికలలో పోటీ చేస్తూ ఎక్కడ ఓడిపోకుండా గెలుపుని మాత్రమే సొంతం చేసుకుంటూ వస్తున్న వ్యక్తి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆయనకి డబల్ హ్యాట్రిక్ సాధించిన ఘనత ఉంది. అలాంటి వ్యక్తిని ఓడించిన మహిళ యశస్విని రెడ్డి. అసలు ఎవరు ఈ యశస్విని రెడ్డి అనే ఉత్సుకత చాలామందికి ఏర్పడింది. యశస్విని రెడ్డి బీటెక్ పూర్తి చేసి అమెరికాలో పనిచేస్తూ ఎన్నికలలో పోటీ చేసేందుకు వరంగల్ కి వచ్చారు.

Ads

ఎర్రబెల్లి దయాకర్ రావుని ఓడించాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. తొలుత పాలకుర్తి అసెంబ్లీ స్థానం నుంచి హనుమాన్ల ఝాన్సీ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించింది కానీ ఆమె ఎన్నారై. ఆమె భారత పౌరసత్వం విషయంలో ఝాన్సీ రెడ్డి దరఖాస్తు విషయంలో స్పష్టత రాలేదు. దీంతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని గ్రహించిన ఝాన్సీ ఆమె కోడలు యశస్విని రెడ్డిని పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టింది.

అందుకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. పాలకుర్తి నుంచి యశస్విని రెడ్డి బరిలోకి దిగిన దగ్గర నుంచి ప్రచారం జోరుగా కొనసాగించింది. ఎర్రబెల్లి దయాకర్ రావు పాలనలో ప్రజలు ఎన్ని కష్టాలు పడింది, ఎక్కడెక్కడ అవినీతి జరిగింది ప్రజలకి వివరించడంలో యశస్విని సక్సెస్ అయింది. ఒక రాజకీయ దిగ్గజాన్ని ఎదిరించి, పోరాడి, విజయం సాధించి పలువురు యువతకి ఆదర్శంగా నిలిచింది.

Previous articleBigg Boss Telugu 7 : ప్రియాంక జైన్ ఇంత పేదరికాన్ని అనుభవించారా..? ముంబైలోని ఆమె ఇల్లు చూశారా..?
Next articleMahesh Babu: మహేష్ కి చెల్లిగా ఆ హీరోయిన్.. ఇదేం కాంబినేషన్ డైరెక్టర్ గారు.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.