Ads
కార్తీక మాసాన్ని చాలా పవిత్రమైన మాసంగా చూస్తారు. కార్తీకమాసం శివకేశవులకు చాలా ప్రీతికరమైన మాసం. ఈ నెల మొత్తం దేవాలయాలలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. శివాలయాలలో ప్రత్యేక పూజలను చేస్తారు. శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగుతుంటాయి.
ఈ నెల అంతా హోమాలు, పూజలు, వ్రతాలు, ఉపవాసాలు చేస్తుంటారు. అంతేకాకుండా శుభకార్యాలకు కూడా ఈ మాసం ప్రసిద్ధి చెందింది. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది. ఆ రోజున చాలామంది 365 వత్తులు వెలిగిస్తారనే విషయం తెలిసిందే. అయితే 365 వత్తులను ఎందుకు వెలిగిస్తారో ఇప్పుడు చూద్దాం..
హిందూ విశ్వాసాల ప్రకారం, కార్తీక పూర్ణిమ చాలా విశిష్టత కలదు. కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన చేయడం ద్వారా అనేక శుభ ఫలితాలు వస్తాయని, యాగ ఫలితం వస్తుందని నమ్ముతారు. ఈ ఏడాది పౌర్ణమి తిథి రెండు రోజులు ఉంది. నవంబర్ 26 ఆదివారం నాడు మధ్యాహ్నం 3-53 గంటలకు మొదలై, నవంబర్ 27 సాయంత్రం 2-45 గంటలకు ముగుస్తుంది. కార్తిక పౌర్ణమి రోజున ముఖ్యమైంది దీపం వెలిగించడం.
Ads
దీపం వెలిగిస్తున్న సమయంలో పౌర్ణమి ఘడియలు, కృత్తిక నక్షత్రం ఉండాలిని పండితులు చెబుతున్నారు. ఆ విధంగా చూస్తే 26న ఈ ఘడియలు ఉండడం వల్ల ఆదివారం నాడే జరుపుకోవాలని సూచిస్తున్నారు. కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులతో దీపం వెలిగిస్తారు. దీపం తమస్సును తొలగిస్తుంది. తమస్సు అంటే చీకటి, అజ్ఞానం అని అర్ధం. అజ్ఞానం తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే దీపాన్ని కార్తికమాసంలో వెలగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
ఈ మాసంలో కృత్తికా నక్షత్రంకు ప్రాధాన్యత ఉంటుంది. కార్తీక మాసం అగ్ని దేవుని ఆరాధనకు ముఖ్యమైంది. దీపం అనేది ప్రత్యక్ష దైవం అయిన అగ్నికి సూక్ష్మరూపం. ప్రతిరోజూ దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించే వీలు లేనివారు, అగ్ని ఆరాధనకు ప్రాధాన్యత ఉన్న కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు సంవత్సరంలోని రోజుకోక వత్తి చొప్పున 365 వత్తులతో దీపాన్ని వెలిగించాలని పండితులు చెబుతున్నారు.
Also Read: దీపావళికి మొదటిసారి దీపాలను వెలిగించిన ఆ ప్రదేశం ఇప్పుడు “పాకిస్థాన్” లో ఉందా.?