Ads
పెళ్లి అనేది జీవితంలో ఒక ముఖ్యమైన విషయం. అయితే పెళ్లిలో ఎవరి ఇష్టాలు వారివి. కొంత మంది చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటారు. కానీ కొంత మంది మాత్రం పెళ్లికి సమయం తీసుకుంటారు. వీరిలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సినిమా రంగానికి చెందిన వారి గురించి. సినిమా రంగంలో ఉన్నవారు చాలా మంది 30 దాటాక మాత్రమే పెళ్లి చేసుకుంటున్నారు.
కొంత మంది 20 లలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది 30 సంవత్సరాలు దాటాక, 35 దాటాక కూడా పెళ్లి చేసుకుంటున్నారు. అందుకు చాలానే కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
#1 పెళ్లి అనేది ఒకరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం. కొంత మందికి తొందరగా పెళ్లి చేసుకోవాలి అనిపించదు. సమాజంలో ఉండే ఒత్తిడి వల్ల పెళ్లి చేసుకోవాలి అని అనుకోరు. అందుకే ఆగి, వారికి నచ్చిన వారు దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటారు.
#2 గతంలో జరిగిన విషయాలు. కొంత మందికి ప్రేమలో విఫలం అయిన వాళ్ళు ఉంటారు. ఆ జ్ఞాపకాలు ఇంకా ఉంటాయి. బ్రేకప్ అనేది మానసికంగా ఒక మనిషి మీద ఎంతో ప్రభావం చూపుతుంది. దాని నుండి వారు బయటికి రావడానికి సమయం తీసుకుంటారు. ఆ తర్వాత ఇంకొకరిని ఇష్టపడటానికి కూడా సమయం పడుతుంది. అందుకే 30 దాటాక, ప్రతి విషయం మీద అవగాహన వచ్చాక పెళ్లి చేసుకుంటారు.
Ads
#3 సినిమా రంగం అన్న తర్వాత చాలా సవాళ్లు ఉంటాయి. అవన్నీ తెలుసుకున్న వారిని అయితే మాత్రమే సినిమా వాళ్ళు ప్రేమిస్తారు. ఒకవేళ సినిమా వాళ్లు ప్రేమించిన వ్యక్తి సినిమా రంగానికి చెందిన వాళ్ళు కాకపోతే సినిమా వాళ్లు ఎదుర్కొనే ఇబ్బందులని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే వారికి అవన్నీ అర్థం అయ్యేటప్పటికి సమయం పడుతుంది. అందుకే ప్రేమించిన కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటారు.
#4 సినిమాలు చేయడానికి సమయం ఎక్కువ పడుతుంది. అలాంటి సమయంలో వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించే అంత వీలు ఉండదు. కాబట్టి సినిమాలు అయిపోయేంత వరకు ఆగి, ఆ తర్వాత కొంత సమయం తీసుకుని పెళ్లి చేసుకొని, మళ్లీ వారి పని మొదలు పెట్టుకుంటారు.
#5 కొంత మంది కెరీర్ లో ఒక ఎత్తుకు వెళ్ళిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు. మానసికంగా, ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందాక పెళ్లి చేసుకోవాలి అని, అప్పుడే ఆనందంగా ఉంటారు అని అనుకుంటారు. అందుకే సమయం తీసుకుని పెళ్లి చేసుకుంటారు.
30 సంవత్సరాలు దాటాక పెళ్లి చేసుకోవడానికి ఎవరి కారణాలు వారివి. కానీ ఏదేమైనా కూడా సినిమా వాళ్లు కూడా అన్ని ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.