Ads
సొంత వాహనాల మీద వెళ్తే ఎక్కువ డబ్బులు అయిపోతాయి. కానీ మనం బస్సు లేదా ట్రైన్ దిగిన తర్వాత ఆటో కట్టించుకుని వెళ్ళిపోతే డబ్బులు అంత అవ్వవు. చాలామంది తక్కువ ధరలో ప్రయాణం చేయొచ్చని ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద పట్టణాల్లో అయితే ఆటోలకి డిమాండ్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఆటోకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి మరి వాటి కోసం చూద్దాం.
సాధారణంగా ఆటో కి మూడే చక్రాలు ఉంటాయి. ఏ ఆటోని చూసినా దానికి మూడే చక్రాలు ఉంటాయి నాలుగు చక్రాలు ఉండవు. కారు వంటి వాటికి నాలుగు చక్రాలు ఉంటాయి. ఆటో కి మాత్రం మూడే ఉంటాయి. దీని వెనక కారణమేంటి..? నాలుగు చక్రాలు పెట్టొచ్చు కదా.. మరి ఇక ఈ విషయం చూస్తే… నాలుగు చక్రాలతో కంటే మూడు చక్రాలతో వాహనాన్ని రూపొందిస్తే ఖర్చు బాగా తగ్గుతుంది.
Ads
నాలుగు చక్రాలకి ఖర్చు ఎక్కువవుతుంది పైగా చక్రాలు మూడే ఉండడం వలన ఇంజనీరింగ్ వర్క్ త్వరగా అయిపోతుంది పైగా మూడే చక్రాలు ఉండడం వలన ఇరుకుగా ఉండే ప్రాంతాల్లో కూడా ఆటోని నడపడానికి అవుతుంది. పైగా ఎక్కడైనా ఆటోని పార్క్ చేయాలన్నా కూడా ఎక్కువ ప్లేస్ పట్టదు. కారు వంటి వాటికి ఎక్కువ ప్లేస్ కావాలి.
పైగా ఇంధన వినియోగం కూడా ఎక్కువగా ఎవ్వడు. ఆటో నడిపేందుకు తక్కువ ఇంధనం సరిపోతుంది పైగా మూడే చక్రాలు ఉండడం వలన కొంచెం స్పీడ్ గా వెళ్లొచ్చు చిన్న చిన్న వీధుల్లో కూడా స్పీడ్ గా వెళ్లడానికి అవుతుంది. నాలుగు చక్రాల వాహనాల కంటే ఇవి అనువుగా ఉంటాయి పైగా నాలుగు చక్రాల వాహనంతో పోల్చుకుంటే మూడు చక్రాల వాహనం తక్కువ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
ఇలా మూడు చక్రాల వలన ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఆటోకి కేవలం మూడే చక్రాలని ఇచ్చారు. నాలుగు చక్రాలను ఇస్తే మెయింటెనెన్స్ మొదలు అనేక సమస్యలు కలుగుతుంటాయి. పైగా చిన్న వీధుల్లో వెళ్లేందుకు కూడా ఇబ్బందిగా ఉంటుంది.