పెళ్లి అయిన తరువాత లెగ్గింగ్స్, జీన్స్ వేసుకుంటే ఈ ఇబ్బందులు ఉంటాయి..!

Ads

ఈ రోజుల్లో ఆడవాళ్ళందరూ లెగ్గింగ్స్, జెగ్గింగ్స్, జీన్స్ వంటి వాటిని ఎక్కువగా ధరిస్తున్నారు. పెళ్లయిన వాళ్లు కూడా ఎక్కువ చీరలు కట్టుకోవడం లేదు. అప్పుడప్పుడు చుడీదార్లు వేసుకుంటూ ఉంటారు కానీ నిత్యం లెగ్గింగ్స్, జెగ్గింగ్స్, జీన్స్ వంటి వాటిని మాత్రమే ఈ రోజుల్లో చాలామంది ధరిస్తున్నారు. చీరల్ని కట్టుకునే వాళ్ళు తక్కువ అయిపోయారు.

సింపుల్ గా వుంటాయని..కంఫర్ట్ గా ఉంటాయని చాలామంది ఆడవాళ్లు రెగ్యులర్ గా లెగ్గింగ్స్ వంటి వాటిని వేసుకుంటున్నారు. స్కూల్ పిల్లల మొదలు కాలేజీ పిల్లలు, పెళ్ళైన వాళ్ళ వరకు జీన్స్, లెగ్గింగ్స్, జెగ్గింగ్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు. లెగ్గింగ్స్ లో అన్ని రంగులు మనకి దొరుకుతూ ఉంటాయి.

టాప్ కి సెట్ అయ్యేటట్టు తీసుకుంటే సరిపోతుంది. లెగ్గింగ్స్ వేసుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. జీన్స్ తో పోల్చితే లెగ్గింగ్స్ చూడడానికి కూడా చాలా బాగుంటాయి. బరువు కూడా తక్కువగా ఉంటాయి కంఫర్ట్ గా ఉంటాయి. అన్ని రంగుల్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి టాప్ కి సెట్ అయ్యే వాటిని ఎంచుకొని వేసుకోవచ్చు. ధర కూడా తక్కువగానే ఉంటుంది.

Ads

చుడీదార్ వంటి వాటిని ఎక్కువ ధర పెట్టి కొనాలి కానీ లెగ్గింగ్స్ తక్కువ ధరకే మనకి దొరుకుతాయి. కానీ లెగ్గింగ్స్ జీన్స్ వంటి వాటి వల్ల కలిగే నష్టాలు చూస్తే ఇంకెప్పుడూ వాటిని మీరు ధరించరు. బిగుతుగా ఉండే ఈ బట్టలు ధరించడం వలన చర్మ సమస్యలు వస్తాయి. ఇండియా వాతావరణ పరిస్థితులకి ఇవి అనుకూలంగా ఉండవు. మన వాతావరణానికి తగ్గట్టుగా మన దుస్తులు వేసుకోవాలి.

లెగ్గింగ్స్ క్లాత్ పల్చగా ఉంటుంది. చల్లగాలి చర్మానికి తాకడం వలన చర్మసంధిత ర్యాషెస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వంటివి వస్తాయి. చలి ఎండ పొల్యూషన్ వీటి కారణంగా బాడీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. చర్మం మాత్రమే కాదు. యుక్త వయసులో ఉండేవాళ్లు పెళ్లయిన ఆడవాళ్లు గాలి తగిలే బట్టలు వేసుకోవడం మంచిది.

ఎందుకంటే పెళ్లి అయిన వాళ్ళకి యుక్త వయసులో ఉండే వాళ్ళకి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి పనులతో బిజీగా ఉంటారు అటువంటప్పుడు సౌకర్యవంతంగా ఉండవు. అందుకని మంచి కాటన్ ప్యాంట్లు, చుడీదార్లు మంచిది. లెగ్గింగ్స్ జీన్స్ వంటి వాటిని వేసుకోకపోవడమే మంచిది.

Previous articleఆటో కి మూడు చక్రాలే ఎందుకు ఉంటాయి..? కారణం ఏమిటి..?
Next articleతుఫాన్ల కి పేర్లు ఎలా పెడతారు..? దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?