మందు కొట్టే ముందు ”చీర్స్” అని ఎందుకు చెప్తారు..? దాని వెనుక ఇంత పెద్ద రీజన్ ఆ…?

Ads

ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సందేహాలు ఉంటాయి. ఇదేంటి అదేంటి అని పదే పదే ప్రశ్నిస్తూ ఉంటారు చాలా మంది. అలానే చాలా మంది కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకు దీనిని అలా చేస్తారు..?, ఎందుకు దీన్ని ఇలా చేస్తారు అంటూ వారిలో సందేహాలు కలుగుతూ ఉంటాయి. పెద్ద వారి కంటే సందేహం చిన్న పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది.

ఎంతో ఉత్సాహంగా పిల్లలు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. నిజానికి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం, దాని వెనుక అర్థాలు తెలుసుకోవడం ఎంతో మంచిగా ఉంటుంది.

ఏదైనా కొత్త విషయం తెలిస్తే మనకి ఆనందం కలుగుతుంది. అయ్యో ఇన్ని రోజులు మనకి ఈ విషయం తెలియలేదే అని బాధపడుతూ ఉంటాం. మీకు ఈ విషయం తెలుసా..? చీర్స్ చెప్పడానికి కారణం ఉందట. ఎక్కువగా తాగుతున్నప్పుడు చీర్స్ చెప్పి తాగుతూ ఉంటారు. ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులు లేక పోతే ఇష్టమైన వ్యక్తి కలిసి డ్రింక్ చేసినప్పుడు చీర్స్ చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు చీర్స్ చెప్తారు..? ఇది నిన్న మొన్న రాలేదు. సముద్రపు దొంగలు ఈ సాంప్రదాయానికి ఆధ్యులు అని చెప్పొచ్చు.

Ads

వీళ్ళు ఓడలని దొంగలించిన తర్వాత డబ్బుని పంచుకోవడానికి వారి విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి దీవి పై దిగే వాళ్లట. కొందరు దొంగలు ఇతర దొంగల వాటాలని దొంగలించాలని వారి మద్యం లో విషం కలిపేవారు. అయితే పరస్పర అనుమానాలని తొలగించడానికి ఒక డీల్ మాట్లాడుకున్నారు. అదే గ్లాసుల్లోని మద్యం తగిలేలా… మద్యం చిందేలా గ్లాసులని తాకించాలని… ఇలా చేసినప్పుడు చీర్స్ అని చెప్పేవారు. దీని వలన ఏ భయం మీరు పడకండి. ఏ విషం కలపలేదని చెప్పడం. దానితో ఏ భయం లేకుండా మద్యాన్ని సేవించేవారు. ఇలా అప్పుడు వచ్చిన ఈ పద్ధతి ని ఇప్పుడు కూడా మనం ఫాలో అవుతున్నాము.

 

Previous articleతెలుగు సినిమా కాన్సెప్ట్ తో వచ్చిన… ఆ హాలీవుడ్ సినిమా గురించి మీరు విన్నారా..?
Next articleఆ స్టార్ హీరోకి లవర్ గా, ప్రస్తుతం వదినగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా?