Ads
కళాతపస్వి కాశీనాధుని విశ్వనాథ్ సినీ కెరీర్ ని సౌండ్ రికార్డిస్టుగా ప్రారంభించి, ఆత్మ గౌరవం చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆయన తొలి సినిమాకే రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డును పొందారు.
Ads
ఈ చిత్రానికి రచయిత్రి యద్ధనపూడి సులోచనరాణి స్టోరీని అందిచారు. గొల్లపూడి, భమిడిపాటి రాధాకృష్ణ మాటలు రాశారు. ఈ సినిమా అనంతరం సిరిసిరి మువ్వ మూవీ చేశారు. ఇక ఈ మూవీతో ఆయన టాలెంట్ కు గుర్తింపు లభించింది. అలా ఆయన సుమారు 60 సినిమాలకు దర్శకత్వం చేశారు. ఆయన జేవీ సోమయాజులతో తెరకెక్కించిన ‘శంకరాభరణం’సినిమా సాధించిన సక్సెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కే.విశ్వనాథ్ కలం నుండి ఎన్నో అద్భుతమైన సినిమాలు జాలు వారాయి. ఆయన తెరకెక్కించిన సినిమాలలోని ఎన్నో క్యారెక్టర్స్ ఆడియెన్స్ హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. సినీ పరిశ్రమలో డైరెక్టర్ గా విశ్వనాథ్ ది ప్రత్యేకమైన స్థానం.ఇక ఈ లెజండరీ డైరెక్టర్ మెగాఫోన్ పట్టాలి అంటే ఆయన ఒంటి పై ఖాకీ దుస్తులు ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఈ విషయం గురించి విశ్వనాథ్ గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలియచేసారు. షూటింగ్ సెట్ లో కళాతపస్వి ఖాకీ యూనిఫామ్ ధరించడం వెనుక పెద్ద స్టోరీ ఉందని తెలిపారు. నేను సౌండ్ రికార్డిస్టుగా చేసి,ఆ తరువాత దర్శకుడిగా మారాను. తలబిరుసుతనం రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నవాడ్ని. సహజంగా ఎమ్మెల్యే అయిన తరువాత మంత్రి కావాలని, ఆ తరువాత మంత్రి కాస్తా ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తారు. అలాగే సినీ పరిశ్రమలో కూడా అంతే. ఏ విభాగంలో తమ కెరీర్ మొదలు పెట్టినా, చివరి గమ్యం దర్శకుడి కుర్చీనే. మరి అటువంటి కుర్చీ నాకు వచ్చినప్పుడు కళ్లు నెత్తికెక్కే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాకు ఎలాంటి గర్వం రాకూడదు. అందుకే కార్మికులలో నేను కూడా ఒకడిని అని నాకు నేను గుర్తుచేసుకోవడం కోసమే ఖాకీ చొక్కా ధరిస్తున్నాను. నా సినిమా సెట్ లో పనిచేసే లైట్ బాయ్స్, పెయింటర్స్, హెల్పర్స్ అందరు ఖాకీ చొక్కానే వేసుకుంటారు. అయితే వారికి నాకు ఒకటే తేడా అది ఏమిటి అంటే వాళ్ళు నిక్కరు వేసుకుంటారు. నేను ప్యాంటు అడే తేడా, నా తొలి సినిమా నుండి కూడా ఖాకీ దుస్తులనే ధరిస్తున్నాను అని తెలిపారు.
Also Read: బాలయ్య ‘అఖండ’ సినిమాలో నటించిన ఈ నటి గురించి తెలుసా?