బాలయ్య ‘అఖండ’ సినిమాలో న‌టించిన ఈ నటి గురించి తెలుసా?

Ads

బోయపాటి శ్రీను దర్శకత్వంలో న‌ట‌సింహం బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా అఖండ. ఈ చిత్రం 2021 డిసెంబర్ 2న విడుదల అయ్యి, ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్ప‌టికీ ఈ మూవీకి క్రేజ్ త‌గ్గ‌లేదని చెప్పవచ్చు.

బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈ రెండు సూపర్ హిట్స్ తరువాత అదే కలయికలో వచ్చిన అఖండ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అఖండ అంచనాలకు తగ్గట్టుగా సూపర్ హిట్ అయింది.
ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. అఖండ మరియు రామకృష్ణ అనే రెండు క్యారెక్టర్స్ లో నటించి ఆడియెన్స్ ని అలరించారు. ఈ మూవీకి థ‌మన్ సంగీతం అందించారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా వచ్చిన ఈ చిత్రంలో బాలకృష్ణ చేసిన యాక్షన్ సీన్స్ మూవీకి ప్లస్ అయ్యాయి. ఇక ఈ మూవీతో నటుడు శ్రీకాంత్ విలన్ గా మారారు. విలన్ గా శ్రీకాంత్ యాక్షన్ చిత్రానికి ప్రత్యేక అట్రాక్షన్ గా నిలిచింది.

Ads


అఖండ మూవీలో నటి నవీన రెడ్డి ముఖ్యమైన క్యారెక్టర్ లో నటించింది. ఈ సినిమాలో ఆమె కనిపించింది కొంచెం సమయమే అయినప్పటికి కీలకమైన పాత్రను పోషించింది. నవీన రెడ్డి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్ 2’ చిత్రంలో కూడా ఒక చిన్న పాత్రను చేసింది. ఆ సినిమా తరువాత భీష్మ, వెంకీ మామ, అద్భుతం వంటి సినిమాలలో నటించింది. అది మాత్రమే కాకుండా అర్ధ శతాబ్దం అనే మూవీలో హీరోయిన్ గా కూడా నటించింది. కాగా ఈ చిత్రాలలో నటించిన రానటువంటి గుర్తింపు అఖండ చిత్రంతో వచ్చింది.
నవీనా రెడ్డిది హైదరాబాద్. ఆమెకు మెగాస్టార్ చిరంజీవిని చాలా అభిమానిస్తుంది. చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చిన సమయంలో ఆయన కోలుకోవాలని నవీన రెడ్డి ప్రత్యేక పూజలు చేసింది. ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన చిత్రాలపై అప్డేట్ లు షేర్ చేస్తుంటుంది. ఆమె మ‌రిన్ని చిత్రాల్లో నటించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇంకా ఏయే సినిమాలలో కనిపిస్తుందో చూడాలి.

Also Read: ”గుమ్మడి” కూతురి పెళ్లికి ఎన్టీఆర్ ఎందుకు వెళ్ళలేదు..? ఇంత గొడవ జరిగిందా..?

Previous articleహాస్పటల్ లో ఉన్న ‘తారకరత్న’ భార్య అలేఖ్య రెడ్డికి సహాయంగా ఉన్న ఈ వ్యక్తి గురించి తెలుసా?
Next articleనందమూరి తారకరత్న ట్రీట్మెంట్ కి ఇప్పటివరకు ఎంత ఖర్చు అయ్యిందో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.