Ads
ప్రస్తుతం ఎవరి చేతిలో చూసిన స్మార్ట్‌ఫోన్ కనిపిస్తోంది. ఏ పని చేస్తున్న పక్కన స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే అన్నట్టుగా ఉంది. లేచిన దగ్గర నుండి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ లేకుండా రోజు గడవట్లేదు.
Ads
మరి అంతగా చూసే స్మార్ట్ ఫోన్ ముందు భాగంలోనూ, వెనుక అలాగే క్రింది భాగంలో కూడా చాలా రకాల ఫీచర్లు ఉన్నాయి. అయితే ఎక్కువ మంది వీటిని పట్టించుకోరు. సాధారణంగా కేవలం బ్రాండ్, అందం చూసే ఫోన్ ను కొనేస్తుంటారు. ఒక్క స్మార్ట్ ఫోన్ కంపెనీ మాత్రమే చూసి కొనేవారు ఎక్కువ మంది ఉన్నారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ ఫీచర్ ప్రతి ఫోన్‌లోను ఉంటుంది. అది ఉండకుండా ఏ ఫోన్ ఉండదు. అయితే ఆ ఫీచర్ ని దాదాపు చాలామంది పట్టించుకోరు. కానీ ఆ ఫీచర్ చాలా ముఖ్యమైనది అని చెప్పవచ్చు. ఇక మీ స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఆ ఫీచర్ ఉంటుంది. దాని గురించి ఇప్పటివరకు మీరు ఆలోచించక పోవచ్చు. మరి ఆ ఫీచర్ ఏమిటి? అది ఎందుకు ముఖ్యం అనేది ఇప్పుడు చూద్దాం.
ఈ ఫీచర్ స్మార్ట్‌ఫోన్ కి క్రింది భాగంలో ఉండేటి ఒక చిన్న రంధ్రం. ఇది ఏమిటి అంటే నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, కాల్ చేస్తున్నప్పుడు ఇది యాక్టివ్‌గా ఉంటుంది. అందువల్ల ఆ వ్యక్తికి మీ స్వరంను మాత్రమే ప్రసారం అయ్యేలా చేస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది. ఈ హోల్ లేకుండా స్మార్ట్ ఫోన్ పని చేయదు. నిజానికి ఈ రంధ్రం కారణంగా మీరు కాల్ మాట్లాడేటప్పుడు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నాయిస్ కాని, వాహనాల నాయిస్ కాని, అలాగే పెద్దగా వినిపించే మ్యూజిక్ కూడా మాట్లాడే అవతలి వ్యక్తికి చేరవు. ఆ వ్యక్తి వాయిస్ ని మాత్రమే కాలర్‌కు చేరుస్తుంది. వాయిస్ స్పష్టంగా ఉంటుంది.
Also Read: విమానంలో ప్రయాణించేటప్పుడు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చెయ్యాలి..?