టాలీవుడ్ లో తెలంగాణ హీరోయిన్స్ కూడా ఉన్నారు.. ఆ 5 గురు హీరోయిన్స్ ఎవరో తెలుసా?

Ads

తెలుగు సిని పరిశ్రమలో నటీనటులు గతంలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ కి చెందినవారే ఉండేవారు. కానీ ప్రస్తుతం అయితే తెలంగాణకు చెందిన హీరోలు కూడా ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ ని ఆంధ్రా ప్రాంత నటినటులే ఏలుతూ వచ్చారు. గతంలో తెలంగాణ నుండి కాంతారావు మాత్రమే హీరోగా ఉండేవారు.

Ads

ఆయన జానపద సినిమాలకు ఫేమస్ హీరో. అంతేకాకుండా ఆయనకి కత్తి కాంతారావు అనే పేరు కూడా వచ్చింది. ఆయన తరువాత ప్రస్తుతం తెలంగాణకు చెందిన నటులు, దర్శకులు, హీరోయిన్లు కూడా రాణిస్తున్నారు. ఇప్ప‌టికే నితిన్, విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోలుగా విజయవంతంగా కెరీర్ లో ముందుకు సాగుతున్నారు. తెలంగాణ నుండి వచ్చిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..సంగీత:
ముత్యాలముగ్గు చిత్రంతో నటిగా గుర్తింపు సంపాదించుకున్న సంగీత, ఆ తరువాత కొన్ని చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. ఇక సంగీతది వరంగల్. ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తరువాత, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా చిత్రాల్లో చేసింది. ఇడియట్ మూవీలో హీరో రవితేజకి తల్లిగా నటించింది.
విజ‌య‌శాంతి:
సంగీత తర్వాత తెలంగాణ నుండి సినీ పరిశ్రమకి వచ్చిన హీరోయిన్ విజ‌య‌శాంతి. వరంగల్ లో పుట్టిన ఆమె చెన్నైలో చదువుకుంది. కర్తవ్యం, ప్రతిధ్వని, ఒసేయ్ రాములమ్మ వంటి చిత్రాలతో నటించి ఒక ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకుని, లేడి సూపర్ స్టార్ అయ్యారు. విజ‌య‌శాంతి ఒకవైపు టాప్ హీరోలకు జంటగా నటిస్తూనే, మరోవైపు లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించేది. ఆ తరువాత తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరం అయ్యారు. చాలా ఏళ్ల తరువాత 2020లో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించారు.
కీర్తి రెడ్డి:
తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డి కూడా తెలంగాణకు చెందినవారే. ఆమె నిజామాబాద్ లో పుట్టి అక్కడే పెరిగింది. తొలిప్రేమ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాతో అప్పటి యువతకి డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఆ మూవీ తరువాత చాలా చిత్రాల్లో నటించింది. అయితే తొలిప్రేమ మూవీతో వచ్చిన క్రేజ్ ని కొనసాగించలేకపోయింది. హీరోయిన్ గా ఒకవైపు చేస్తూనే, మరోవైపు గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన అర్జున్ సినిమాలో మహేష్ కి అక్కగా చేసింది. ఆ మూవీ తర్వాత హీరో సుమంత్ ని వివాహం చేసుకుంది. కానీ కొంతకాలనికే వారు విడిపోయారు. కీర్తిరెడ్డి రెండో వివాహం చేసుకొని బెంగుళూరులో సెటిల్ అయ్యింది.
ప్ర‌త్యూష:
కీర్తి రెడ్డి తరువాత తెలంగాణ నుండి వచ్చిన హీరోయిన్ ప్ర‌త్యూష. ఆమె భువ‌న‌గిరిలో జ‌న్మించింది. ప్ర‌త్యూష కెరీర్ మొదట్లో చిన్న పాత్ర‌లు చేసింది. ఆ తరువాత క‌లుసుకోవాల‌ని చిత్రంలో హీరో ఉద‌య్ కిర‌ణ్ కు జంటగా న‌టించింది. ఆ తరువాత అనుకోని కార‌ణాల వ‌ల్ల చిన్న‌వ‌య‌సులోనే ప్ర‌త్యూష కన్నుమూసింది.
రేష్మా రాథోడ్:
ఈరోజుల్లో మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన రేష్మా రాథోడ్ కూడా తెలంగాణ‌ అమ్మాయే. ఆమెది ఇల్లందు. రేష్మా బాడీగార్డ్, ల‌వ్ సైకిల్ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా న‌టించింది.
Also Read:  ఈ హీరోయిన్ల పచ్చబొట్ల వెనుక ఇంత కథ ఉందా..?

Previous articleఅంతర్జాతీయ క్రికెట్ నుండి ధోని రిటైర్ అయినా.. SA20 లో ఆడలేడు.. కారణం ఇదే..!
Next articleస్మార్ట్‌ఫోన్‌ కి ఉండే ఈ చిన్న హోల్ ఎంతగా ఉపయోగపడుతుందో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.