Ads
రాజమౌళి గురించి కొత్తగా మనం ఏం చెప్తాము..? రాజమౌళి అందరికీ సుపరిచితమే పైగా బాహుబలి వంటి పెద్ద సినిమాను తీసుకువచ్చి చాలా పాపులర్ అయిపోయారు. అలానే ఆర్ఆర్ఆర్ సినిమా కూడా అందరికీ తెగ నచ్చేసింది.
ఇక కీరవాణి విషయానికి వస్తే మంచి మంచి సంగీత దర్శకుడు కీరవాణి. కీరవాణి, రాజమౌళి అన్నదమ్ములే. అయితే చాలా మందికి ఓ సందేహం వుంది.
కీరవాణి, రాజమౌళి అన్నదమ్ములే కదా మరి ఒకే ఇంటి పేరు అవ్వాలి. కానీ వీళ్లిద్దరి పేర్ల ముందు ఎందుకు వేరు వేరుగా ఉంటుంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారి కి అయితే ఆయన పేరు ముందు కెవి అని ఉంటుంది. కానీ కీరవాణి పేరు ముందు ఏమో ఎమ్ఎమ్ అని.. రాజమౌళి పేరు ముందు చూస్తే ఎస్ఎస్ అని ఉంటుంది. ఏమిటి ఇలా వేరు వేరుగా వున్నాయి..? అయితే మీకూ ఈ సందేహం కలిగిందా..? మరి కారణం ఇదే చూసేయండి.
Ads
ఒకే ఫ్యామిలీ అయినా అంత మార్పు దేనికి వచ్చింది అనేది చూస్తే.. రాజమౌళి, కీరవాణి ఇద్దరి ఇంటి పేరు కూడా కోడూరి. కళ్యాణి మాలిక్ వాళ్ళు కూడా కోడూరు వాళ్ళే. కళ్యాణి మాలిక్ కూడా వీళ్ళ సోదరుడే. ఎస్ఎస్ రాజమౌళి లో ఎస్ఎస్ అంటే శ్రీశైల శ్రీ రాజమౌళి. ఆయన పూర్తి పేరు శ్రీశైల శ్రీ రాజమౌళి కనుక ఆయన పేరు ముందు ఎస్ఎస్ అని ఉంటుంది. మరి ఇక కీరవాణి విషయానికి వస్తే.. కీరవాణి పూర్తి పేరు మరకతమణి కీరవాణి కావడం తో ఆయన పేరు ముందు ఎమ్ఎమ్ ఉంటుంది. బ్రదర్స్ ఏ వీళ్ళు. కేవలం పూర్తి పేర్ల వలెనే పేరు ముందు ఎమ్ఎమ్ అని ఎస్ఎస్ అని పెట్టుకున్నారు తప్ప. అవి ఇంటి పేరులు కావు.
Also Read: పెళ్లి కోసమని జిమ్ కి వెళ్లడం మొదలెట్టారా.? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..లేదంటే.?