Ads
ప్రతీ ఒక్కరి ఇంట్లో కూడా కొన్ని ఆచారాలు, పద్ధతులు ఉంటాయి. చాలా వాటిని మనం మన భారతీయ సంస్కృతిని బట్టి అనుసరిస్తూ ఉంటాము. శుభకార్యాలు మొదలు అశుభాలు వరకు ప్రతిదీ కూడా మన ఆచారాలు, సంప్రదాయాలు ప్రకారం అనుసరించడం జరుగుతూ ఉంటుంది. పెళ్లికి ఎలా అయితే పద్ధతి ఉందో చనిపోయిన తర్వాత కూడా అంత్యక్రియలు ఇలా కొన్ని పద్ధతులు ఉన్నాయి.
దాని ప్రకారమే అనుసరిస్తూ ఉంటారు. ఈ పద్ధతులు నిన్నో మొన్నో వచ్చినవి కాదు. మన పూర్వీకులు వాళ్ళ పూర్వీకులు నుండి వచ్చాయి.
అయితే చనిపోయిన తర్వాత మనిషి కాలి బొటన వేళ్ళని కలిపి కడుతూ ఉంటారు. అయితే అసలు ఎందుకు ఇలా కాళ్ళ బొటన వేళ్ళని కలిపి కడతారు..? దీని వెనుక కారణం ఏమిటి అనే విషయాన్ని మనం చూద్దాం. మనిషి చనిపోయిన తర్వాత వారి కాళ్ళ బొటని వేళ్ళని కట్టడం వెనక కారణం ఏమిటంటే.. మనిషి చనిపోయాక కాళ్ళు బొటని వేళ్ళని రెండు కూడా ఒక దారంతో కడతారు. ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళ శరీరం నుండి ఆత్మ వేరేగా వెళ్ళిపోతుంది. అయితే మనిషి చనిపోయాక కూడా ఆత్మ ఇంకా బతకాలి… వాళ్లతో ఉండాలని అందరూ కూడా తాపత్రయపడుతూ ఉంటారు.
Ads
మనిషి లోకి ప్రవేశించి తిరిగి జీవితంలోకి వెళ్లిపోవాలని ఆత్మ అనుకుంటూ ఉంటుంది. శవం లోకి వెళ్లి మళ్లీ ఇంట్లోకి వెళ్లిపోవడానికి చూస్తుంది. అలా ప్రయత్నం చేసినప్పుడు కాళ్ళని కదలకుండా ఉంచేందుకు ఒక తాడుని కానీ ఒక దారాన్ని కానీ కడతారు. అయితే దీని వెనక ఒక లాజిక్ కూడా ఉంది. చనిపోయాక శరీరం బిగుసుకుపోతుంది. అప్పుడు చలనం ఉండదు కాబట్టి కాళ్లు పక్కకి పడిపోతాయి. అలా జరగకుండా ఉండేందుకు రెండు కాళ్ళ బొటన వేళ్ళని ఒక దారంతో కడతారు. ఈ పద్ధతిని పాటించడానికి కారణం ఇదే.