బ్రిటీష్ వారు పెట్టిన కుక్క‌ల‌కు, భార‌తీయుల‌కు ప్ర‌వేశం లేదనే బోర్డ్ చూడ‌గానే తిరుగుబాటు చేసిన వీర వనిత.!

Ads

స్వాతంత్య్రం కోసం భారతదేశంలో ప్రాణాల‌ను తృణప్రాయంగా అర్పించిన వారు ఎంతో మంది ఉన్నారు. వారంతా బ్రిటిష్ పాలకులకు వ్య‌తిరేకంగా పోరాడి ప్రాణ త్యాగం చేశారు. అలాంటి గొప్ప వారంద‌రినీ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాం.

Ads

అయితే స్వాతంత్య్రం కోసం పోరాడిన చాలా మంది అమ‌ర‌వీరుల గురించి ఎక్కువ మందికి తెలియదు. స్వాతంత్య్ర పోరాటంలో అసాధార‌ణమైన తెగువ చూపించి, పోరులోనే త‌మ ప్రాణాల‌ను త్యాగం చేశారు. వారిలో ప్రీతిలత‌ వ‌డ్డేదార్ అనే వీరనారి ఒక‌రు. ప్రీతిలత‌ 21 సంవత్సరాల వ‌య‌స్సులోనే బ్రిటిష్ వారిపై పోరాటం చేస్తూ త‌న‌ ప్రాణాల‌ను దేశం కోసం అర్పించింది.ప్రీతిల‌తా 1911లో మే 5వ తేదీన చిట్ట‌గాంగ్‌ లో జ‌న్మించారు. ఇది ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది. ప్రీతిల‌తాది మ‌ధ్య త‌ర‌గతికి చెందిన కుటుంబం. అయితే ఆమెకు చిన్నతనం నుండే విప్ల‌వ భావాలు, దేశ‌భ‌క్తి ఉండేవి. ఆమె విద్యాభ్యాసం చిట్టగాంగ్‌, ఢాకాల‌లో కొన‌సాగింది. ఆ తరువాత ఆమె ఉన్న‌త విద్య‌ కోసం కోల్‌క‌తాలోని బెథునె కాలేజీలో చేరింది. ఆ స‌మ‌యంలో నేతాజీకి స‌హాయ‌కురాలిగా ఉండే లీలా నాగ్ అనే విద్యార్థిని దీపాలి సంఘ అనే విప్ల‌వ సంఘంను ఏర్పాటు చేసింది. అయితే ప్రీతిల‌తా ఆ సంఘానికి ఆక‌ర్షితురాలై అందులో చేరింది. ఇక ఆ సంఘంలో చేరిన స్త్రీలకు యుద్ధ నైపుణ్యాలు నేర్పేవారు.
చిట్టగాంగ్‌లోని బ్రిటిష్ వారి ఆయుధాగారం పై 1930ల‌లో దీపాలి సంఘంలోని స‌భ్యులు దాడి చేయాలని భావించారు. ఆయుధాగారంలోని తుపాకుల‌ను, మందు గుండు సామ‌గ్రిని తీసుకోవ‌డం, దానితో పాటుగా అక్కడి టెలిఫోన్‌, టెలిగ్రాఫ్ వ్య‌వ‌స్థ‌ల‌ను తొలగించాలనుకున్నారు. దానికోసం చిట్ట‌గాంగ్ కు చెందిన ప్రీతిల‌త‌కు ముఖ్యమైన బాధ్య‌త‌లను ఇచ్చారు. ఆమెతో పాటు ఇంకొందరు సంఘసభ్యులు కలిపి 65 మంది దాకా క‌లిసి చిట్టగాంగ్‌ ఆయుధాగారం మీద దాడికి వెళ్లారు. అయితే అక్కడ వారికి తుపాకులు, మందుగుండు సామ‌గ్రి లాంటివి ఏం దొరకలేదు. వారు అనుకున్నట్టుగానే టెలిఫోన్‌, టెలిగ్రాఫ్ వ్యవస్థలను అయితే నాశ‌నం చేశారు. ఆ తరువాత చిట్ట‌గాంగ్‌లోనే యురోపియ‌న్ క్ల‌బ్‌ పై దాడి చేశారు. ఎందుకంటే ఆ క్ల‌బ్ ‌బ‌య‌ట ‘ఇండియన్స్ అండ్ డాగ్స్ నాట్ ఆలోవుడ్’ అనే బోర్డును పెట్టారు.
వారు ఇండియన్స్ ని అవ‌మానించేలా పెట్టిన ఆ బోర్డు పెట్టిన క్లబ్ వారి పై దీపాలి సంఘ స‌భ్యులకు ఆగ్ర‌హం వచ్చింది. దాంతో 1932 సెప్టెంబ‌ర్ 23వ తేదీన ప్రీతిల‌త‌ నేతృత్వంలో ఆ క్ల‌బ్‌ మీద దాడి జరిపారు. బ్రిటిష్ వారు వారిపై కాల్పులు జ‌రిపారు. ఇక ఆ కాల్పుల్లో ప్రీతిల‌త‌కు కొన్ని గాయాలు అయ్యాయి. కానీ బ్రిటిష్ అధికారులు సంఘ స‌భ్యుల‌ను వెంటాడడంతో తాను బ్రిటిష్ అధికారులకి దొరుకుతానేమో అని భావించిన ప్రీతిల‌త‌ పొటాషియం స‌య‌నైడ్ మింగి ఆత్మార్ప‌ణం చేసుకుంది. దేశం కోసం త‌న ప్రాణాల‌ను త్యాగం చేసింది. ఆ సమయంలో ఆమె వ‌య‌స్సు కేవ‌లం 21 ఏళ్లు మాత్ర‌మే. కోల్‌క‌తాలోని ఇందిరా గాంధీ స‌ర‌ని అనే రోడ్డులో ప్రీతిల‌త‌ విగ్ర‌హాన్ని ప‌శ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. కాగా ప్రీతిల‌త గురించి చిట్ట‌గాంగ్ లో ఉండేవారికి, బెంగాలీలకు త‌ప్ప ఎక్కువ మందికి తెలియ‌దు.
Also Read: అక్కడ జనవరి 29న రిపబ్లిక్ డే.. ఎందుకు అలా జరుపుకుంటున్నారో తెలుసా?

Previous articleచనిపోయాక కాలి బొట‌న వేళ్ల‌ను ఎందుకు కట్టేస్తారు.. కారణం ఇదేనా..?
Next articleOTT లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా చూశారా..? ఎలా ఉందంటే..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.