Ads
ఎప్పుడైనా మనం ఏదైనా ద్విచక్ర వాహనాన్ని కానీ నాలుగు చక్రాల వాహనాన్ని కానీ ఓపెన్ చేయాలంటే మన పెద్దలు మొదట ఆ వాహనానికి పసుపు కుంకుమ పెట్టి నిమ్మకాయలని మిరపకాయలని కట్టమని చెప్తూ ఉంటారు. అలానే నిమ్మకాయని వాహనంతో తొక్కించి మొదలు పెట్టమని అంటారు. మీ ఇంట్లో కూడా ఇలానే చెప్తూ ఉంటారా..? అయితే మరి నిజంగా వాహనాన్ని నిమ్మకాయతో ఎందుకు తొక్కించాలి…?
దీని వెనక కథ ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. నిజానికి చాలా మందికి ఈ విషయం తెలియకుండా గుడ్డిగా నమ్ముతూ వస్తున్నారు. కానీ దీని వెనక చాలా పెద్ద కథ ఉంది.
కొత్త వాహనాల కింద ఎందుకు నిమ్మకాయలను తొక్కించాలి అనే విషయాన్ని ఇప్పుడే చూసేద్దాం. పూర్వం మనకి ఇప్పుడు మనం ఉపయోగించే బండ్లు కానీ కార్లు కానీ లేవు. ఇది వరకు ఎడ్ల బండి మీద గుర్రపు బండి మీద ప్రయాణం చేసేవారు. చాలా చోట్లకి గుర్రాలు వెళ్లి వచ్చేవి. ఇలా వెళ్లే క్రమంలో ఆ గుర్రాలకి రాళ్లు తగులుతూ ఉండేవి. అలానే మట్టి, బురద ఇటువంటివన్నీ కూడా వాటి కాళ్ళకి తగులుతూ ఉండేవి. ఈ క్రమంలో గుర్రాల కాళ్ళకి పుండ్లు అయ్యేవి. ఒకవేళ కనుక ఇలాంటివి సంభవిస్తే కచ్చితంగా ఇన్ఫెక్షన్ వస్తుంది.
Ads
దీనివల్ల బండి కూడా సరిగ్గా వెళ్ళదు. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది ఇది బ్యాక్టీరియాని తొలగిస్తుంది. దీని మూలంగానే నిమ్మకాయని గుర్రాల చేత తొక్కించే వాళ్ళు అలా చేయడం వలన గుర్రాలకి బ్యాక్టీరియా వంటి ఇబ్బందులు కలగవు. అందుకనే పూర్వకాలంలో బండి వెళుతున్నప్పుడు నిమ్మకాయను తొక్కించేవారు. అయితే అదే ఆచారాన్ని మనం ఇప్పుడు కూడా గుడ్డిగా అనుసరిస్తున్నాము. రబ్బర్ టైర్ల మీద నిమ్మకాయలని ఎక్కి తొక్కిస్తున్నాము. కానీ అప్పటి రోజుల్లో ఈ కారణం మూలానే నిమ్మకాయని తొక్కించే వారు. అలా అప్పుడు పెద్దలు పెట్టిన ఈ ఆచారాన్ని ఈ తరం కూడా అనుసరిస్తున్నారు.