”కుంభకర్ణుడు” ఆరు నెలలు ఎందుకు నిద్రపోతుంటాడు..? బ్రహ్మ అలా చెయ్యడం వల్లేనా..?

Ads

చాలామంది ఎవరైనా నిద్ర పోయినప్పుడు కుంభకర్ణుడులా నిద్రపోతున్నావు అని అంటూ ఉంటారు. ఇలా అనడాన్ని మీరు చాలా సార్లు వినే ఉంటారు. మీరు కూడా మీ జీవితంలో చాలా సార్లు ఇలా అనే ఉంటారు. కానీ ఎందుకు అలా అంటారు అనేది మీకు తెలియకపోవచ్చు. అయితే అసలు ఎందుకు ఇలా అంటారు..? కుంభకర్ణుడిలా నిద్రపోయావు అని అనడం వెనుక కారణం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడే తెలుసుకుందాం.

బాగా ఎక్కువగా తిన్నా బాగా ఎక్కువ సేపు నిద్రపోయినా కుంభకర్ణుడుతో పోలుస్తూ ఉంటారు. రావణాసురుడు సోదరుడు కుంభకర్ణుడు.

కుంభకర్ణుడు ఆరు నెలలకు ఒకసారి మేల్కొనేవాడు. మేల్కొన్న రోజు మొత్తం ఆహారాన్ని తీసుకుని తర్వాత మళ్లీ నిద్రపోతాడు. అయితే ఎందుకు కుంభకర్ణుడు ఇలా నిద్రపోతాడు అనేది తెలీదు రామాయణంలోని ఉత్తరకాండలో ఈ విషయాన్ని చెప్పారు. రావణుడితో కలిసి విభీషణుడు కుంభకర్ణుడు దైవానుగ్రహం కోసం అనేక సంవత్సరాలు తపస్సు చేస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు మెచ్చి వరం కోరుకోమని చెబుతాడు. రావణాసురుడుని అడిగితే అమరత్వాన్ని కోరుకుంటాడు.

Ads

కానీ అందుకు బ్రహ్మ ఒప్పుకోడు. బదులుగా పక్షులు, పాములు, యక్షులు, రాక్షసులు చేతులో మరణం ఉండదని చెప్తాడు. విభీషణుడు నీతిని పాటించే మార్గం లో నడుచుకునేలా వరం అడుగుతాడు. ఆ వరాన్ని ఇస్తాడు బ్రహ్మ. కుంభకర్ణుడికి మాత్రం ఏ వరం లేకుండా చూస్తారు. ఎందుకంటే తన ఆకలితో ప్రపంచాన్నే నాశనం చేస్తున్నాడని. అందుకే వరం అడగకుండా చెయ్యాలని బ్రహ్మ అనుకుంటాడు. అందుకు సరస్వతి సహాయం అడుగుతాడు. కుంభకర్ణుడు వరం అడిగేటప్పుడు నాలుక అదుపు లో ఉండేలా చెయ్యమంటాడు.

ఇంద్రుని ఆసనాన్ని కుంభకర్ణుడు అడగలనుకుంటాడు. కానీ అది నిద్రాసనం అవుతుంది. నిద్రాసనం అని కుంభకర్ణుడు నాలుక మీద వస్తుంది. వెంటనే తధాస్తు అంటాడు బ్రహ్మ. వెంటనే రావణుడు ఇలా నిరంతరమూ నిద్ర లో ఉండడం మంచిది కాదని చెప్తాడు. తర్వాత మేల్కొనేలా వరాన్ని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ ఆరు మాసాలు నిద్రలో ఉండి.. ఒక రోజు మేల్కొనేలా వరం ఇస్తాడు. ఆ నాడు భూమి మీద వుండే మానవుని ఆహారంగా కుంభకర్ణుడు తీసుకుంటాడు. కానీ రామ రావణ యుద్ధ సమయంలో మాత్రం నిద్ర పోయిన తొమ్మిది రోజులకి నిద్ర లేచేస్తాడట. రామాయణ యుద్ధకాండలో దీన్ని చెప్పారు.

Previous articleకొత్త వాహనం కొన్నప్పుడు.. నిమ్మకాయలని టైర్ కింద పెట్టి ఎందుకు తొక్కించాలి..? దాని వెనుక వున్న కథ ఇదే..!
Next articleనందమూరి హీరో “కళ్యాణ చక్రవర్తి” గుర్తున్నారా..? ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..?