Ads
రానున్న ఎన్నికలలో ఉమ్మడిగా పోటీ చేయబోతున్న జనసేన, తెదేపా పార్టీలు కలిసి తాడేపల్లి గూడెంలో ప్రచారభేరి సభ ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పార్టీ కోసం జనసేన కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. స్టేజి మీదనే ఇరు పార్టీల వారు కలిసి 500 మంది ఉండేలా చూసుకున్నారు. అంతా బాగానే కానీ తెలుగుదేశం కీలక సభ్యుడు నారా లోకేష్ సభలో ఎక్కడా కనిపించలేదు. అయితే లోకేష్ ఎందుకు సభకి హాజరు కాలేదు అన్న విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.
అయితే తెదేపా వర్గం వారు నారా లోకేష్ కావాలనే ప్రచార బేరి సభకు దూరంగా ఉన్నారని చెప్తున్నారు. అక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రసంగాలు మాత్రమే హైలెట్ కావాలని, తాను మాట్లాడితే బాగుండదని లోకేష్ అనుకున్నారని అంటున్నారు. పైగా సభ ఏర్పాట్లు అన్ని జనసేన పార్టీ చాలా శ్రద్ధతో చేసింది, అందుకోసం చాలా కష్టపడింది అందుకే ఆ పార్టీని హైలెట్ చేయాలని లోకేష్ భావించాడంట.
Ads
అందుకే పార్టీలో చంద్రబాబు, బాలకృష్ణ మినహా తెదేపా నేతలు ఎవరూ ప్రసంగించలేదు అంటున్నారు తెదేపా వర్గం వారు. ఈ ఎన్నికలలో తెదేపా పార్టీ కోసం పాదయాత్ర చేసిన నారా లోకేష్ ఒక కార్యకర్తగానే తన కృషి ఉంటుందని, అంతకుమించి క్రెడిట్ తీసుకునేందుకు ఆసక్తిగా లేరని అంటున్నారు. తెదేపా కార్యక్రమాల్లో చంద్రబాబు తర్వాత లోకేష్ కనిపించినప్పటికీ ఉమ్మడి సభల్లో మాత్రం చంద్రబాబు మాత్రమే ప్రధానంగా ఉంటారని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఉంటారని తెలుగుదేశం పార్టీ వర్గం వారు.
పైగా నారా లోకేష్ మంగళగిరిలో తీరిక లేకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రోజు పలు రంగాల ప్రముఖుల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే పాదయాత్ర కోసం దాదాపు ఏడాది పాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. మళ్లీ ఎన్నికలు షెడ్యూల్ వచ్చే ముందు ప్రచార బాధ్యతలని రాష్ట్రం మొత్తం నిర్వర్తించాల్సి ఉంది. అందుకే నియోజకవర్గంలో సుడిగాలిలా పర్యటించాలని నిర్ణయించుకున్నారని రాజకీయ వర్గాల సమాచారం.