Ads
సిని పరిశ్రమలో దాదాపు నటినటులందరు మంచి చెడులు పంచుకుంటారు. ఎవరింట్లో ఏ కార్యక్రమం జరిగిన కుటుంబ సభ్యులతో వెళ్తుంటారు. అయితే కింగ్ నాగార్జున మాత్రం ఎవరు చనిపోయిన కూడా చూసేందుకు వెళ్లరు. అయితే చాలా సంవత్సరాలుగా ఇలాగే చేస్తున్నాడు.
Ads
అక్కినేని నాగార్జున టాలీవుడ్ లో అగ్ర నటుడు, అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. నాగార్జున సుమారు 100 పైగా చిత్రాల్లో నటించాడు. టాలీవుడ్ లో దాదాపు అందరి నటీనటులతోను మంచి అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. అలాంటి నాగార్జున ఎవరైనా చనిపోయిన కూడా చూసేందుకు వెళ్లరు. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినప్పుడు కూడా చూడడానికి నాగార్జున వెళ్లలేదు. దీంతో అందరూ ఈ విషయం గురించే చెప్పుకుంటారు. దీని పై మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ కామెంట్స్ వచ్చాయి.
అక్కినేని నాగేశ్వరరావు, సతీమణి అన్నపూర్ణమ్మ చనిపోయిన సమయంలో టాలీవుడ్ పరిశ్రమతో పాటు, వందలాది అభిమానులు తరలివచ్చారు. కానీ అక్కడికి వచ్చిన వారందరి కళ్ళు నాగార్జున కోసమే వెతికాయి. ఆయన ఎందుకు చివరి చూపుకు రాలేదనేది ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలింది.అయితే నాగార్జున ఈ విషయంలో తప్ప మిగతా అన్ని కార్యక్రమాలకి వెళ్తారు. అలా పెళ్లిళ్లకు, పార్టీలకు, ఫంక్షన్లకు హాజరవుతుంటారు. సెలబ్రిటీల వివాహలకి కొన్నిసార్లు కుటుంబ సమేతంగా కూడా హాజరవుతుంటారు.
ఎవరైనా చనిపోతే నాగార్జున వెళ్ళింది ఒక్క దాసరి నారాయణరావు గారింటికే, దాసరి భార్య పద్మ మరణించినపుడు మూడవ రోజు దాసరిని కలవడానికి వెళ్లారు. అయితే దానికి మరో కారణం కూడా ఉంది. ఆ టైమ్ లో నాగార్జున మూవీ ఆగిపోవడంతో ఆ పనీ పై వెళ్ళి, అలగే పరామర్శించి వచ్చాడు.
అయితే ఆయన కొడుకులు నాగ చైతన్య, అఖిల్‌లు ఆయన వైఖరికి డిఫరెంట్ గా వ్యవహరిస్తారు. సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినపుడు చైతు,అఖిల వెళ్లి మహేష్ ని ఓదార్చారు. అయితే నాగ చైతన్య ఇంతకు ముందు కొందరు సినీ సెలబ్రిటీలు మరణించినపుడు వెళ్లి చివరి చూపు చూసి, వారి కుటుంబాన్ని పరామర్శించి వచ్చాడు.
Also Read: సరోగసి ద్వారా పిల్లలను కన్న 10 మంది సినీ సెలబ్రెటీలు వీరే..!