సరోగసి ద్వారా పిల్ల‌ల‌ను క‌న్న 10 మంది సినీ సెల‌బ్రెటీలు వీరే..!

Ads

ఈ మధ్య కాలంలో న‌యన‌తార‌, విఘ్నేశ్ శివ‌న్ లు స‌రోగ‌సీ పద్ధతిలో ట్వీన్స్ కి జన్మనివ్వడం వివాదాస్ప‌దంగా మారిన సంగతి అందరికి తెలిసిందే. ఈ విషయం దేశ‌వ్యాప్తంగా వైర‌ల్ కూడా అయ్యింది.

దీంతో న‌యన‌తార‌ కన్నా ముందు స‌రోగ‌సీ ద్వారా తల్లిదండ్రులు అయిన సెల‌బ్రెటీలు ఎవ‌ర‌ని తెగ సెర్చ్ చేసారు. అయితే స‌రోగసీ పద్ధతి ద్వారా చాలామంది సినీ సెల‌బ్రెటీలు త‌ల్లిదండ్రులు అయ్యారు. మరి సరోగసి ద్వారా పిల్ల‌ల‌ను క‌న్న సినీ సెల‌బ్రెటీలు ఎవరో చూద్దాం..
1.న‌యన‌తార‌:
లేడీ సూపర్ స్టార్ న‌యన‌తార‌, డైరెక్టర్ విఘ్నేశ్ శివ‌న్ పెళ్లి అయిన నాలుగు నెలలకే స‌రోగ‌సీ ద్వారా క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చారు.
2.ప్రియాంక చోప్రా:
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, ఆమె భ‌ర్త నిక్ జోనాస్ లు ఈ పద్ధతి ద్వారానే బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు.

3.స‌న్నీలియోన్
స‌న్నీలియోన్ అద్దె గ‌ర్భం ద్వారా ఇద్ద‌రు ట్వీన్స్ కు జ‌న్మ‌నిచ్చింది.

Ads

4.అమీర్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ 2వ వైఫ్ కిర‌ణ్ రావు స‌రోగ‌సి ద్వారా మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. అయితే ఈమె అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల స‌రోగ‌సిని ఎంచుకుంది.
5.షారుక్ ఖాన్
షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ లు తమ 3వ బిడ్డ‌ను అద్దె గ‌ర్భం ద్వారానే కన్నారు.
6.మంచు ల‌క్ష్మి
టాలీవుడ్ లో మంచు ల‌క్ష్మి అద్దె గ‌ర్భం ద్వారా ఆడబిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.
7.క‌ర‌ణ్ జోహార్
బాలీవుడ్ ఫిలిం మేకర్ క‌ర‌ణ్ జోహార్ వివాహం చేసుకోకుండానే అద్దె గ‌ర్భం ద్వారా ఇద్ద‌రు పిల్లలకు జ‌న్మనిచ్చాడు. ఇక వారిని త‌న త‌ల్లి స‌హాయంతో చూసుకుంటున్నారు.

8.శిల్పాశెట్టి:
బలివుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలు తమ రెండో సంతానాన్ని స‌రోగ‌సీ ద్వారానే పొందారు.

9.తుషార్ క‌పూర్:
బాలీవుడ్ నటుడు తుషార్ క‌పూర్ స‌రోగ‌సీ ద్వారానే  మగబిడ్డ‌ను పొందాడు.
10.ఏక్తాక‌పూర్:
బాలీవుడ్ నిర్మాత ఏక్తాక‌పూర్ కూడా సరోగసి ప‌ద్ధ‌తిలోనే మ‌గ‌బిడ్డకు జ‌న్మనిచ్చారు.

Also Read:ఈ ఏడాదిలో మరణించిన 10 మంది తెలుగు సినీ ప్రముఖులు..

Previous articleకాంగ్రెస్ హైకమాండ్ వద్ద మాజీ ఎంపీ పొంగులేటికి అనూహ్యంగా పెరిగిన ప్రాధాన్యత!
Next articleగర్భగుడి వెనుక భాగాన్ని ఎందుకు మ్రొక్కుతారు.. కారణం ఇదేనా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.