Ads
త్రిమూర్తుల్లో ఒకరు లయకారుడైన శివుడు. ఇంచుమించుగా అన్ని ఊర్లలోను శివాలయం ఉంటుంది. శివుడికి అభిషేకాలు చేస్తూ వుంటారు. అలానే శివుడిని ఆరాధిస్తూ ఉంటారు. అయితే మాములుగా అన్ని దేవాలయాల్లో త్రిశూలం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం పంచశూలాన్ని పెట్టారు. అయితే మరి ఎందుకు ఈ ఆలయం లో త్రిశూలం కాకుండా పంచశూలాన్ని పెట్టారు అనే విషయాన్ని చూద్దాం.
పంచశూలాన్ని శిఖరంపై ఉంచారు. ఈ ఆలయం జార్ఖండ్ లోని డియోఘర్ లో వున్నది. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది కూడా ఒకటి.
అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఆలయాన్ని పరిగణించబడుతుంది. ఇక ఇప్పుడు దేవఘర్ లో ఉన్న బాబా వైద్య నాధుడు ఆలయం గురించి చూద్దాం. జ్యోతిర్లింగంతో పాటు ఈ ఆలయానికి ఇంకో ప్రత్యేకత కూడా వుంది. త్రిశూలానికి బదులుగా పంచశూలాన్ని ఈ ఆలయ శిఖరంపై పెట్టారు. ప్రతి రోజూ వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వస్తూ వుంటారు. త్రిశూలం మూడు కోణాల తో ఉంటుంది. అయితే అదే పంచశూలం అంటే ఐదు కోణాల తో ఉంటుంది.
Ads
త్రిశూలం శివునికి ఇష్టమైన ఆయుధం. శివలింగానికి కానీ మహాదేవునికి కానీ త్రిశూలం తో అలంకరించుతారు. మరి పంచశూలం ఏంటి..? దీని ప్రాముఖ్యత ఏమిటి..? ఈ విషయం ఇప్పుడే చూద్దాం. డియోఘర్ లోని బాబా వైద్యనాథ ఆలయం శిఖరం పై పంచశూలం వుంది. కామం, కోపం, లోభం, దురాశ, అసూయ అనే ఈ ఐదు దుర్గుణాలు నుండి కాపాడుతుందని విశ్వాసం. మనిషిని అన్ని బాధలను నుండి దూరం చేస్తుంది ఇది.
రామ కథకు పంచశూలానికి సంబంధం ఏంటి..?
తన బంగారు నగరంలో పంచశూలాన్ని త్రేతాయుగంలో రావణుడు ప్రతిష్టించాడని అంటారు. కారణం ఏమిటంటే ఇది ఎక్కడ ఉంటే అక్కడ ఒక రక్షణ కవచంగా మారుతుందని అంటారు. అలానే ఈ పంచశూల రక్షణ కవచాన్ని ఎలా చేధించాలో కేవలం రావణుడికి తెలుసట. శ్రీరాముడు సైన్యం దీని మూలంగా లంక లోకి ప్రవేశించడం కష్టం. కానీ విభీషణుడి సహాయంతో అక్కడకు వెళ్లి రావణుడిని సంహరించాడు శ్రీరాముడు.