విమానం రెక్కలపై ఎరుపు, పచ్చ రంగు లైట్లు ఎందుకు ఉంటాయి..?

Ads

ఫ్లైట్లో వెళ్లడం చాలా ఈజీగా ఉంటుంది. ఎంత దూరమైనా సరే మనం కొన్ని గంటల్లో చేరుకోవచ్చు కానీ కాస్త ఖరీదు ఎక్కువే. కొంచెం దగ్గర ప్రాంతాలకు వెళ్లాలన్నా కూడా ఎక్కువ రేటు పెట్టి టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా మనకు టికెట్ల గురించి ప్రయాణం గురించి తెలుస్తుంది కానీ విమానానికి సంబంధించి కొన్ని రహస్యాలు మనకి తెలియవు.

ఏదైనా మనకు తెలియని కొత్త విషయం తెలుసుకోవడం మనకి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి. ప్రతి దాని వెనుక ఒక కారణం ఉంటుంది. ఆ కారణం తెలిస్తే చాలామంది షాక్ అవుతూ ఉంటారు. ఆకాశంలో విమానం వెళ్ళేటప్పుడు రెక్కలు కింద ఎరుపు ఆకుపచ్చ రంగులు లైట్లు మనకి కనబడుతుంటాయి.

మీరు ఎప్పుడైనా దీన్ని గమనించారా..? అయితే ఎందుకు ఆకుపచ్చ రంగు లైట్లు, ఎరుపు రంగు లైట్లు మనకి కనబడుతూ ఉంటాయి..? ఎందుకు అలా పెట్టారు అనే విషయాన్ని చూస్తే.. అన్ని విమానాలకి లైట్లు ఉండవు కానీ కమర్షియల్ ఫ్లైట్స్ కి లైట్స్ ఉంటాయి. రాత్రిపూట ఈ లైట్లు వెలుగుతూ ఉంటాయి వీటిని వెలిగించడానికి ఒక కారణం ఉంది.

Ads

అదేంటంటే ఎరుపు ఆకుపచ్చ రంగు లైట్లను నావిగేషన్ లైట్లను అంటారు ఇతర ఫ్లైట్స్ కి దూరంగా వచ్చే విమానం స్పష్టంగా కనపడటం కోసం ఈ లైట్లు ఏర్పాటు చేశారు. ఈ నావిగేషన్ లైట్లు ఎలాంటి సంకేతాలని కూడా విడుదల చేయవు కానీ రాత్రి పూట ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు సులభంగా చూసే విధంగా చూడడానికి ఏర్పాటు చేశారు. అలానే ఇతర ఫ్లైట్లు కూడా వీటిని చూస్తాయి.

విమానాలకి ఒక రెక్క మీద ఆకుపచ్చ ఇంకో రెక్క మీద ఎరుపు రంగు లైట్లు ఉంటాయి ఈ రెండు ఫ్లాష్ అయ్యి విమానం విజిబిలిటీని పెంచుతాయి అయితే రెండు ఒకే రంగుని ఉపయోగించచ్చు కదా రెండు రెక్కలకి వేరు వేరు రంగులు ఎందుకు ఉపయోగించారు అన్న సందేహం కూడా మీలో ఉండే ఉంటుంది.

ఎందుకు ఉపయోగించ లేదంటే ట్రాఫిక్ కంట్రోలర్లు లేదంటే పైలెట్లు ఎదురుగా వచ్చే విమానాన్ని డ్రోన్లు లేదా వాతావరణ బెలూన్స్ అనుకొనే ఛాన్స్ ఉంది ఈ కారణంగానే ఈ విధంగా లైట్ లని సెట్ చేశారు. పడవలకి కూడా ఇదే విధంగా ఉపయోగిస్తారు. ఈ నావిగేషన్ లైట్స్ ఉండడం వలన విమానాలు ఢీకొనే ప్రమాదం తగ్గుతుంది.

Previous articleగుడి నుంచి ఇంటికి వచ్చాక కాళ్ళు ఎందుకు కడుక్కోకూడదు..? కారణం ఏమిటి..?
Next articleఒకరిని దీవించేటప్పుడు అక్షింతలు ఎందుకు వెయ్యాలి..? కారణం ఏమిటో తెలుసా..?