ఒకరిని దీవించేటప్పుడు అక్షింతలు ఎందుకు వెయ్యాలి..? కారణం ఏమిటో తెలుసా..?

Ads

సాధారణంగా మనం ఎప్పుడైనా ఎవరినైనా ఆశీర్వదించాలన్నా దీవించాలన్నా అక్షింతలు వేస్తూ ఉంటాము. అయితే ఎందుకు వేయాలి..? దాని వెనక కారణం ఏంటి..? చాలామందికి దాని వెనుక కారణం తెలియదు. అయితే పెద్దలు చెప్పారని ఇదివరకు రోజుల్లో పాటించే వాళ్ళని ఈ రోజుల్లో కూడా చాలామంది పాటిస్తున్నారు.

ఎక్కువగా పెళ్లికి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు కానీ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. పెద్దవాళ్లు వారి దీవెనలు ఇస్తూ ఉంటారు. అక్షింతలు వేసి మంచి జరగాలని కోరుకుంటారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్తూ ఉంటారు.

అయితే ఎందుకు పెళ్లిలో కానీ శుభకార్యాల్లో కానీ అక్షింతలు వేస్తూ ఉంటారు.. ఎందుకు వాడతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. మీకు కూడా ఈ సందేహం ఉంటే ఇప్పుడే క్లియర్ చేసుకోండి. అక్షింతలు ఎందుకు వేయాలి చాలా వస్తువులు ఉన్నాయి కదా ఉదాహరణకి పువ్వులు ఉన్నాయి కదా వాటిని వెయ్యొచ్చు కదా.. అక్షింతలు ఎందుకు వేయాలి..? అయితే అక్షింతలు అంటే క్షతము నాశనం కానివి.

Ads

బియ్యము శుభానికి సమృద్ధికి సంకేతము. పసుపు క్రిమిసంహారకాలను నివారిస్తుంది. అందుకని ఈ రెండిటిని కలిపి శిరస్సు మీద వేస్తారు ఇలా చేయడం వలన ఆరోగ్యకరమైన అభివృద్ధి అందుతుంది. అందుకనే ఎవరైనా ఆశీర్వదించే ముందు అక్షింతలు శిరస్సు మీద వేసి ఆ తర్వాత ఆశీర్వదిస్తూ ఉంటారు ఎలా పడితే వాటిని వాడకూడదు.

చిన్నవాళ్ళ తలలో బ్రహ్మ రంధ్రం పైన పడేలా అక్షితలని వేయాలి అలా చేయడం వలన ఆయురారోగ్యాలు కలిగి ఎలాంటి ఆటంకాలు లేని అభివృద్ధి పొందవచ్చు. తలలోని బ్రహ్మ రంధ్రం పైన ఈ అక్షింతలు పడడం వలన శరీరంలో సానుకూల తరంగాలు ఉత్తేజమౌతాయి అందుకని అక్షింతలు చల్లుతూ ఉంటారు.

ఒకరి నుండి ఒకరికి శక్తిపాతం ద్వారా అనుగ్రహం లభించడానికి అక్షింతలు తోడ్పడతాయి. పెళ్లిలో కూడా తలంబ్రాల సమయంలో వధూవరులు బియ్యాన్ని ఒకరి శిరస్సు మీద ఒకరు వేసుకుంటూ ఉంటారు. దానికి గల కారణం ఏంటంటే విరగని బియ్యం లాగ జీవితాలు కూడా బియ్యంలా సాగిపోవాలని దాని వెనక అర్థం.

Previous articleవిమానం రెక్కలపై ఎరుపు, పచ్చ రంగు లైట్లు ఎందుకు ఉంటాయి..?
Next articleవెంక‌టేశ్వ‌ర స్వామికి వ‌డ్డీ కాసుల వాడ‌నే పేరు ఎలా వచ్చింది అంటే..?