క్రికెట్ ఆడే సమయంలో.. కొందరు ”రెండు క్యాప్స్” ని ఎందుకు పెట్టుకుంటారో తెలుసా.?

Ads

క్రికెట్ ఆట ఆడడం చూడడం అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. అందులో ఇండియా ఆడుతుంది అంటే ప్రత్యేకించి సమయం కుదుర్చుకొని మరీ చూస్తూ ఉంటారు. ఐపీఎల్ మ్యాచ్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆఖరి బంతి వరకు కూడా మనం ఐపీఎల్ మ్యాచ్లను చూస్తూ ఉంటాము. క్రికెట్ ఆటలో మనకి తెలియని చాలా విషయాలు ఉంటాయి.

కొన్ని కొన్ని సార్లు క్రికెట్ కి సంబంధించిన కొత్త విషయాలు తెలుసుకుంటే ఎంతో బాగుంటుంది. ఎప్పుడూ కూడా కొత్త విషయాలని మనం తెలుసుకుంటూ ఉండాలి.

కొత్త విషయాలను తెలుసుకోవడం వలన మనకి నాలెడ్జ్ మరింత పెరుగుతుంది. పైగా ఎవరికైనా మనం చెప్పొచ్చు. క్రికెట్ కి సంబంధించి మనకి అన్ని విషయాలు తెలుసు అని ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం కానీ తెలియని విషయాలు కూడా ఉంటూ ఉంటాయి. అటువంటివి తెలిస్తే షాకింగ్ అనిపిస్తూ ఉంటుంది. క్రికెట్ లో ఒక్కొక్కసారి ఒక ప్లేయర్ రెండు క్యాప్ లని పెట్టుకుంటూ ఉంటారు. ఈ సందేహం నాకు చాలా సార్లు కలిగింది. ఎందుకు రెండు క్యాప్ లని ఒక ఆటగాడు పెట్టుకుంటాడు అని…

Ads

క్రికెటర్లు రెండు క్యాప్స్ ని మరచిపోయి లేదంటే కాస్త డిఫరెంట్ లుక్ లో కనపడాలనో పెట్టుకోరు. దీని వెనుక పెద్ద కారణమే ఉంది అదేంటంటే రెండు క్యాప్స్ కూడా ఆటగాడివి కాదు. ఆ ఆటగాడు క్యాప్ ఒకటి మాత్రమే. ఇంకొకటి బౌలర్ క్యాప్. ఇదివరకు చూస్తే బౌలర్ బౌలింగ్ చేసే సమయంలో క్యాప్ ని ఎంపైర్ కి ఇచ్చేవారు. కరోనా వచ్చిన తర్వాత రూల్స్ మార్చారు.

ఆటగాళ్లు వాళ్ళ క్యాప్స్ ని కానీ టవల్స్ ని కానీ ఎంపైర్ కి ఇవ్వకూడదు. సో ఆటగాడు బౌలింగ్ చేసే సమయంలో తన క్యాప్ ని దగ్గరలో ఉన్న ప్లేయర్ కి కానీ లేదంటే కెప్టెన్ కి కానీ ఇస్తాడు ఆటగాడు. దీనితో రెండు క్యాప్ లను ఒకేసారి పెట్టుకుంటాడు. రెండు కాప్స్ ని ఒక ఆటగాడు ధరించడానికి కారణం ఇదే.

Previous articleతారకరత్న గురించి ఎన్టీఆర్ ‘అమిగోస్’ ఈవెంట్‌లో మాట్లాడకపోవడం వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసా?
Next articleడైరెక్టర్ పరుశురాం, పూరి జగన్నాథ్ ల మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసా?