గుమ్మానికి ఎందుకు నిమ్మకాయలని, మిరపకాయలని కట్టాలి..? కారణం ఏమిటి అంటే..?

Ads

ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించాలని అనుకుంటూ ఉంటారు. ఎటువంటి సమస్యలు లేకుండా హాయిగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అయితే సంతోషంగా ఉండడానికి ఎన్నో రకాల పద్ధతులని పాటిస్తూ ఉంటారు. పూర్వకాలం నుండి పెద్దలు పాటిస్తున్న పద్ధతుల్ని కూడా చాలామంది అనుసరిస్తూ ఉంటారు ఇంటి గుమ్మాలకి నిమ్మకాయలని పచ్చిమిరపకాయలని లేదంటే ఎండుమిరపకాయలని కడుతూ ఉంటారు.

అయితే ఎందుకు నిమ్మకాయలని మిరపకాయలని కట్టాలి..? అలా వేలాడతీయడం వలన ఏమైనా ఉపయోగం ఉందా అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం… మన భారత దేశంలో చాలా గ్రామాలలో ఈ మూఢ నమ్మకం ఎక్కువగా ఉంది.

ఇంటి ముందు కానీ షాప్ ముందు కానీ నిమ్మకాయలని మిరపకాయలని కడుతూ ఉంటారు. ఎప్పుడైనా ఎందుకు అలా కడుతున్నారు అని అడిగితే దిష్టి పోవడానికి అని అంటూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి దరిద్ర దేవత అక్క చెల్లెళ్ళు. దరిద్ర దేవతకి పులుపు కారం అంటే ఇష్టం.

Ads

గుమ్మం ముందు పులుపు కారం వుండే నిమ్మకాయలని పచ్చిమిరపకాయలని కట్టడం వలన ఆ దరిద్ర దేవత కావాల్సిన వాటిని గుమ్మం ముందు తినేసి లోపలికి రాకుండానే వెళ్ళిపోతుంది అని నమ్మకం. అందుకని గుమ్మాలకి ఈ విధంగా కడుతూ ఉంటారు. ఇంటికి లక్ష్మీదేవి వస్తే లక్ష్మీదేవి వెనక దరిద్ర దేవత కూడా వస్తుందని అంటూ ఉంటారు.

దీని వెనక ఒక పెద్ద కథ కూడా ఉంది అదేంటంటే ఒక వ్యాపారి దగ్గరికి లక్ష్మీదేవి, దరిద్ర దేవత ఇద్దరూ వెళ్తారు. ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారు అని అడుగుతారు అప్పుడు ఆ వ్యాపారి తెలివిగా లక్ష్మీదేవి గుమ్మం లోపలికి వచ్చేటప్పుడు దరిద్ర దేవత గుమ్మం బయటకు వెళ్లేటప్పుడు అందంగా ఉన్నారని అంటాడు.

లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే ఇష్టం అందుకే శుభకార్యాల్లో పూజ సమయంలో తియ్యటి ఆహార పదార్థాలని తయారు చేసి పెడతారు. ఇది ఇలా ఉంటే దీని వెనక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది అదేంటంటే నిమ్మకాయ మిరపకాయల నుండి వచ్చే వాసన కీటకాలు తెగళ్లుని ఆ ప్రదేశంలో ఉంచకుండా దూరం చేస్తుంది. పూర్వకాలంలో పురుగులు మందులు వంటివి ఉండేవి కాదు అలాంటప్పుడు ఇవి బాగా పనిచేసేవి. అందుకని అప్పట్లో మిరపకాయలని నిమ్మకాయలని గుమ్మానికి కట్టే వాళ్ళు.

Previous articleఆశిష్ విద్యార్థి లవ్ మ్యారేజ్ చేసుకున్న “రూపాలీ బరువ” ఎవరు అంటే..?
Next articleగూగుల్ లో వ్యక్తిగత వివరాలు ఏమి లేకుండా ఉండాలంటే… ఇలా చెయ్యండి..!